కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..

కోవిడ్ వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను, ఎలా ఖర్చు పెట్టారో, వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వ్రాసిన ఒక లేఖలో ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో ఆలోచించి దేశ, రాష్ట్రాల బాగు కోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు.. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి పైన లేని పోని విమర్శలు […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 4:03 pm
Follow us on


కోవిడ్ వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను, ఎలా ఖర్చు పెట్టారో, వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వ్రాసిన ఒక లేఖలో ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో ఆలోచించి దేశ, రాష్ట్రాల బాగు కోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు..

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి పైన లేని పోని విమర్శలు చేస్తూ ఉపయోగించిన భాషను కేసీఆర్ విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసంమో స్పష్టం చెయ్యాలని కరీంనగర్ ఎంపీ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, రైతులకు క్రమం తప్పకుండా, అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నదని గుర్తు చేసారు. అయితే రైతు బంధు ద్వారా, రైతులకు ఇలా అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేదా చెప్పమని సంజయ్ కేసీఆర్ ను నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు, రాష్ట్రానికి కోవిడ్ నిధులను ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ కింద ఇచ్చిన రూ 224 కోట్లు, మెడికల్ పరికరాల కోసం ఇచ్చిన రూ 216 కోట్లు, డివల్యూషన్ నిధులలో తొలి విడతగా ఇచ్చిన రూ 982 కోట్లు ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు ఏవేవో మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. పీఎం కేర్స్ నిధుల నుంచి ప్రధాని రూ 3100 కోట్లను వెంటిలేటర్ ల తయారీకి, వలస కార్మికుల కోసం, వాక్సిన్ అభివృద్ధికి కేటాయించారని గుర్తు చేశారు.

మరి, సీఎం రిలీఫ్ ఫండ్ కు, మీ కొడుకు కేటిఆర్ కు అందిన విరాళాలు మొత్తం ఎంత? మీరు వాటిని ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. వలస కార్మికుల తరలింపు కోసం, మీరు ఖర్చు పెట్టారని చెపుతున్న డబ్బులు, కేంద్రం ఇచ్చిన విపత్తు నిధి నుంచా? లేదా వేరే నిధుల నుండి ఇవి వచ్చాయా? అంటూ నిలదీశారు.