BJP President Bandi Sanjay: బండి సంజయ్ కు తీవ్ర గాయం.. పాదయాత్ర సాగేనా?

BJP President Bandi Sanjay: తెలంగాణలో (Telangana) బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 28 నుంచి హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం లంగర్ హౌస్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా తోపులాట జరిగింది. ఇందులో సంజయ్ కిందపడిపోయారు. దీంతో కాలికి గాయమైంది. దీంతో వైద్యం చేయించుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రకు జనం ఎక్కువగా రావడంతో ఆయనలో జోష్ పెరుగుతోంది. […]

Written By: Srinivas, Updated On : August 30, 2021 6:39 pm
Follow us on

BJP President Bandi Sanjay: తెలంగాణలో (Telangana) బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 28 నుంచి హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం లంగర్ హౌస్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా తోపులాట జరిగింది. ఇందులో సంజయ్ కిందపడిపోయారు. దీంతో కాలికి గాయమైంది. దీంతో వైద్యం చేయించుకుని తిరిగి పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రకు జనం ఎక్కువగా రావడంతో ఆయనలో జోష్ పెరుగుతోంది. ప్రజల కోసం పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలపై తనదైన విమర్శలు చేస్తున్నారు.

పాదయాత్రలో భాగంగా మూడో రోజు లంగర్ హౌస్ లో ఆయన మాట్లాడారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే అధికార పార్టీ టీఆర్ఎస్ లో చలిజ్వరం వచ్చేలా ఉందని తెలుస్తోంది. అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు. ప్రతి చోట ప్రభుత్వ అసమగ్ర విధానాలను ఎండగడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ చేసిన మోసంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించాలని భావించినా కేసీఆర్ మోకాలడ్డుతున్నారని చెప్పారు.

రాష్ర్టంలో ప్రస్తుతం కుటుంబ పాలన సాగుతోంది. వారి కుటుంబసభ్యులే స్టేట్ ను తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంజయ్ పలు చోట్ల ప్రస్తావిస్తున్నారు. ధనిక రాష్ర్టమని చెబుతూనే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ర్టం కొట్టుమిట్టాడుతోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఇప్పటికి రాష్ర్టంలో కేవలం వందల సంఖ్యలో నిర్మించిన ఇళ్లను చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏ నియోజకవర్గానికి ఎన్ని కేటాయించారో చెప్పాలని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దీనికి నేతలెవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మహారాష్ర్టలో గత బీజేపీ ప్రభుత్వంలో 70 వేల ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందజేశారు. కానీ ఇక్కడ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలేవి జరగడం లేదు.

అర్బన్ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేసేందకు సర్కారు ముందకు రావడం లేదు. మున్సిపాలిటీల్లో 2,03,080 ఇళ్లు మంజూరు చేశారు. జీహెచ్ఎంసీకి 1.40 లక్షల ఇళ్లు కేటాయించారు. వీటి నిర్మాణం కోసం రూ.3500 కోట్లు కేటాయించినా ఇందులో రూ.2,285 కోట్లు ఇప్పటికే విడుదల చేసినా రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సమాచారం.