తాజాగా యాంగ్ బ్యొన్ అణు రియాక్టర్ వినియోగంలోకి తెచ్చినట్లు తెలిసింది. రియాక్టర్ నుంచి అణ్వాయుధాల్లో ఉపయోగించే ఫ్లూటోరియంను ఉత్పత్తి చేస్తారని చెబుతున్నారు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థను 2009 నుంచి ఇక్కడికి రాకుండా ఉత్తర కొరియా అడ్డుకున్నా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తోంది. దీంతో ఉత్తర కొరియా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధ్యక్షుడు మాత్రం చలించడం లేదు.
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ కార్యక్రమాలను పసిగడుతున్నారు. రియాక్టర్ పనిచేస్తున్న విషయాన్ని అవి ధ్రువపరుస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరిలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర కొరియా తీరుతో ఏం జరుగుతుందోననే అనుమానాలు నెలకొన్నాయి. ఉత్తర కొరియాను హద్దుల్లో ఉంచాలని సూచించినా దాని సహజ గుణాన్ని వీడడం లేదు. దీంతో ప్రపంచంలోని ప్రజలు అణ్వాయుధాలతో బెంబేలెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
సింగపూర్ లో 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఉత్తర కొరియా అగ్రనేత బేటీ జరిగిన కొన్ని నెలల్లోనే రియాక్టర్ ను మూసివేశారు. ప్రస్తుతం మాత్రం ఇదే కాంప్లెక్స్ లో ఉన్న అణు ఇంధన రీప్రాసెస్ లాబరోటరీ పనిచేస్తోందని తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకమని తెలిసినా ఉత్తర కొరియా తన విధానాన్ని మార్చుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.