Warangal BJP Meeting: తెలంగాణలో రాజకీయాల తీరు మారుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ నుంచి వరంగల్ వరకు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర వరంగల్ జిల్లా జనగామ చేరుకునే సరికి టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరగడంతో శాంతిభద్రతల దృష్ట్యా పాదయాత్ర కొనసాగించొద్దని సూచిస్తూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో బీజేపీ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా జరిపి తీరుతామని సవాలు చేస్తోంది. దీంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి.

ప్రజాసంగ్రామ యాత్రకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జరిపి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈనెల 27న నిర్వహించే బహిరంగ సభకు ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం అనుమతి నిరాకరిండంతో పార్టీ మళ్లీ కోర్టు గడప తొక్కనుంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతోనే తాము పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పడం గమనార్హం. దీంతో అధికార పార్టీ బీజేపీని అడ్డుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ చేపట్టే పాదయాత్రకు అడ్డుతగిలినా కోర్టు అనుమతించడంతో న్యాయం తమ వైపే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Also Read: Chandrababu NSG Security: చంద్రబాబుకు 30 మంది కమాండోలతో భద్రత.. ఏమైంది? ఎందుకిలా?
ఈనేపథ్యంలో ప్రభుత్వానికి బీజేపీకి మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడులో గెలిచి తీరుతామని మూడు పార్టీలు చెబుతున్నా బీజేపీకే విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో మంచి పట్టుంది. అందుకే అక్కడ బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరని తెలుస్తోంది. దీంతోనే టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరుతామని బీజేపీ చెబుతోంది. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందోననే భయం అందరిలో వ్యక్తమవుతోంది.

27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే బహిరంగ సభపై కూడా సందేహాలు వస్తున్నాయి. పోలీసుల అనుమతి లేదనే ఉద్దేశంతో ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం సభకు పర్మిషన్ నిరాకరించడంతో సభ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం జరిపి తీరుతామని ప్రకటిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందనే ఆందోళన అందరిలో వస్తోంది. మొత్తానికి బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు కోర్టు అనుమతించడంతో సభ కూడా జరిపి తీరుతామని చెబుతున్నారు. దీనిపై వరంగల్ లో గొడవలు చెలరేగే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు
సభ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదని చెప్పడంతో బీజేపీ నేతలు కూడా చాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ జరిపి తీరుతామని చెబుతుండటంతో రెండు పార్టీల మధ్య పోరు జరుగుతోందని తెలుస్తోంది. అధికార పార్టీ దురుద్దేశంతోనే బీజేపీకి అడ్డు తగులుతుందని ఆరోపణలు చేస్తోంది. వరంగల్ లో ఏం జరుగుతుందోననే దానిపై స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు ఒకరి కంటే మరొకరు మిన్నగా భావిస్తున్నాయి. దీంతో రేపు జరిగే సభపై సందేహాలు వస్తున్నాయి.
Also Read:Ghulam Nabi Azad: ఆజాద్ కూడా పాయే.. కాంగ్రెస్ ను ఇక ఎవరూ కాపాడలేరు! రాహుల్ పై సంచలన వ్యాఖ్యలు