Online Classes: కరోనా కారణంగా పిల్లల చదువులు సంకనాకిపోయాయి. రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్ల ముందు ఆన్ లైన్ క్లాసులు వింటూ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కరోనా తగ్గి.. మళ్లీ పెరగడంతో స్కూళ్లు మూతపడ్డాయి.ఈ ఫిబ్రవరి నుంచి మళ్లీ తెరుస్తున్నారు.

ఇంతటి విపత్కర పరిస్థితుల వేళ తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. వైరస్ ముప్పు తొలిగిపోని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 20వ తేదీ వరకూ ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని సూచించింది.
Also Read: సొంత పార్టీలోనే అసమ్మతి కుంపట్లు ఎదుర్కొంటున్న జగన్
హైదరాబాద్ వంటి మహానగరాల్లో కరోనా తొందరగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అక్కడ తప్పకుండా కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, బార్లు,రెస్టారెంట్ల వద్ద కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడారం సమ్మక్క -సారక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని ఆదేశించింది.
ఇక తెలంగాణలో వైభవంగా సాగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లోనూ నిబంధనలు అమలయ్యేలా చూడాలని అడ్వొకేట్ జనరల్ కు కోర్టు తెలిపింది.
ఇప్పటికే ప్రజల నిర్లక్ష్యం కారణంగా కరోనా మళ్లీ విజృంభించిందని.. ఈసారైనా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని హైకోర్టు కీలక ఆదేశాలుజారీ చేసింది.
ఇక కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో కోర్టుకు తెలియజేయాలని తెలంగాణ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా కరోనా టైంలో రక్షణచర్యలు, విద్యార్థుల చదువులపై హైకోర్టు కీలక సూచనలు చేసింది.
Also Read: మెగా వేలం వేళ ఫ్రాంచైజీల వ్యూహాలు.. హైదరాబాద్ టీమ్ ప్లేయర్స్ వీళ్లే..!
[…] […]
[…] […]