CM KCR: దేశంలో మూడో కూటమి ప్రయత్నాలకు కేసీఆర్ బీజం వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో జట్టు కట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు గాను వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ సీఎంలను కలిసిన కేసీఆర్ తాజాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ను ప్రగతి భవన్ లో కలిసి చర్చలు జరిపారు. బీజేపీయేతర పార్టీల ఏకీకరణకు నడుం బిగించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే నేతల ఐక్యతకు పెద్దపీట వేస్తున్నారు.
దేశంలో బీజేపీ దూసుకుపోతుండటంతో దానికి కళ్లెం వేయాలని భావిస్తున్నారు. బీజేపీ అసంబద్ధ విధానాలను ఎండగట్టేందుకు ఉపక్రమిస్తున్నారు. దేశంలోని బీజేపీ యేతర పక్షాలను ఒక్కటి చేసేందుకు సిద్ధమయ్యారు. దీని కోసమే నేతలను కలుస్తూ వారిలో ఐక్యత భావాన్ని నింపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ సీఎంలు స్టాలిన్, పినరయ్ విజయన్ లను కలిసి పరిస్థితిని వివరించారు. బీజేపీని ఓడించడానికి ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.35 వేల వేతనంతో?
కేంద్రంలో బీజేపీ విధానాలు అసమంజసంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. రైతు చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు తదితర సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను నిరంతరం వేధిస్తోందని చెబుతున్నారు. దీనిపై ఉద్యమించేందుకు అందరు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. దేశంలో మూడో కూటమి అవసరం ఉందని సూచిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మనమంతా ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అందరు ఏకీభవిస్తున్నారు. బీజేపీపై పోరాడేందుకు సహకరిస్తున్నారు. దీంతో బీజేపీని అధికారానికి దూరం చేయాలనే కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చనుందా? ఇంకా ఎంత మంది కేసీఆర్ కు మద్దతు ఇస్తారు? బీజేపీని గద్దె దించే సత్తా కేసీఆర్ కు ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనే కేసీఆర్ ఆశయం నెరవేరుతుందా ? లేదా? వేచి చూడాల్సిందే.
Also Read: శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌లో జాబ్స్.. నెలకు రూ.2 లక్షల వేతనంతో?