Homeఎంటర్టైన్మెంట్Skylab OTT: ఓటీటీలో నిత్యా మీనన్ ‘స్కైలాబ్’.. అధికారిక డేట్ వచ్చేసింది..!

Skylab OTT: ఓటీటీలో నిత్యా మీనన్ ‘స్కైలాబ్’.. అధికారిక డేట్ వచ్చేసింది..!

Skylab in OTT : మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ‘స్కైలాబ్’ మూవీతో నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెల్సిందే. ‘స్కైలాబ్’ కథ విన్న వెంటనే తనకు బాగా నచ్చడంతో ఈ మూవీలో నటించేందుకు నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ మూవీ కథను అద్భుతంగా తెరకెక్కించాడు.

Skylab Telugu Movie Review
Skylab Telugu Movie

‘స్కైలాబ్’ మూవీలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1979లో జరిగిన ‘స్కైలాబ్’ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ఈ మూవీని దర్శకుడు విశ్వక్ తెరకెక్కించారు.

నాటి సీరియస్ ఇష్యూకు దర్శకుడు కొంత ఎంటటైన్మెంట్ జోడించి ఈ మూవీని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు తమ నటనతో ఆకట్టుకుున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. జనవరి 14న ప్రముఖ ఓటీటీ సోనీ లివలో ‘స్కైలాబ్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని Sony LIv ట్వీటర్లో వెల్లడించింది.

ఈ మూవీని డాక్టర్ రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. తన తొలి మూవీతోనే దర్శకుడు విశ్వక్ కందెరావ్ విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే ఆసక్తి నెలకొంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

4 COMMENTS

  1. […] Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ త్వరలో కీలక పదవని ఇవ్వబోతుందని తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తన టీమ్ మెట్స్ అందరినీ ఒక్కొక్కరిగా క్రికెట్ లోకి తీసుకుంటున్నారని గత కొద్ది కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించాడు. ఇక ఇప్పుడు సచిన్ టెండూల్కర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డాడు దాదా. […]

  2. […] AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ లేనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయడం లేదు. దీంతో ఇన్నాళ్లు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా కేబినెట్ విస్తరణపై జగన్ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేపడితే అనవసరంగా విభేదాలు వచ్చే అవకాశాలున్నందున విస్తరణ జోలికి పోయే సాహసం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. […]

  3. […] mudragada padmanabham: ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పార్టీల్లో ఉన్న సిద్ధాంతాల దృష్ట్యా కుల ముద్రలు వేయించుకున్న సందర్భంలో ప్రస్తుతం కులాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ కాపు వర్గంగా జనసేన పార్టీ స్థాపించినా ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండానే చూసుకుంటున్నారు. కానీ ఆయనపై కాపు ముద్ర పడిపోయింది. టీడీపీకి అయితే కమ్మ సామాజిక వర్గ ముద్ర ఏనాడో పడిపోయింది. జగన్ అయితే రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాస్ర్టంలో కుల ప్రధానంగా పార్టీల మనుగడ సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజిక వర్గం సమావేశానికి హాజరు కావడంతో ఆయనపై కూడా కుల ముద్ర పడింది. […]

  4. […] Trisha: స్టార్ హీరోయిన్ త్రిష కూడా కొన్ని రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, త్రిష ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో తన హెల్త్ కి సంబంధించి అప్ డేట్ ఇస్తూ.. ‘నాకు కరోనా నెగిటివ్ వచ్చింది, నేను నెగిటివ్ అయ్యాను, . మొదటిసారిగా నేను నెగిటివ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు నేను 2022 సంవత్సరానికి రెడీగా ఉన్నా’ అంటూ తన లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పింది ఈ చెన్నై బ్యూటీ. […]

Comments are closed.

Exit mobile version