https://oktelugu.com/

తెలంగాణలో కొత్త పార్టీ? తీన్మార్ మల్లన్న పెడతారా?

తెలంగాణలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఒకటి రెండు పార్టీలే అనుకున్నా ఇపుడు ఆ సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని భావించినా రేవంత్ రెడ్డి రాకతో రెక్కలొచ్చాయి. తన తండ్రి పేరుతో పార్టీ పెట్టిన షర్మిల కూడా తన ప్రభావం చూపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈటల రాజేందర్ సైతం బీజేపీ నుంచి తన ప్రభావాన్ని ఇనుమడించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీల సంఖ్య […]

Written By: , Updated On : July 20, 2021 / 04:44 PM IST
Follow us on

Teenmar Mallanna New Political Partyతెలంగాణలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఒకటి రెండు పార్టీలే అనుకున్నా ఇపుడు ఆ సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని భావించినా రేవంత్ రెడ్డి రాకతో రెక్కలొచ్చాయి. తన తండ్రి పేరుతో పార్టీ పెట్టిన షర్మిల కూడా తన ప్రభావం చూపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈటల రాజేందర్ సైతం బీజేపీ నుంచి తన ప్రభావాన్ని ఇనుమడించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తీన్మార్ మల్లన్న సైతం పార్టీ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. యూత్ లో ఉన్న ఇమేజ్ ను బేస్ చేసుకుని ఆగస్టు 29న పార్టీ పేరు ప్రకటించి జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. రాష్ర్టంలోని పలు మండలాల్లో బహిరంగసభలు పెట్టి మరింత గుర్తింపు తెచ్చుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసినట్లు చెబుతున్నారు. విద్య, వైద్యం కోసం 40 శాతం బడ్జెట్ కేటాయించేలా పోరాడాలని భావించాలని చూస్తున్నారు.

కేజ్రీవాల్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయనను తెలంగాణ పాదయాత్రకు రావాల్సిందిగా కోరారు. ఆయన నడిచిన మార్గంలోనే నడిచేందుకు మల్లన్న తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాదయాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు తమ ప్రభావాలు చూపించే విధంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు పాచికలు వేస్తున్నాయి. తమ ఉనికి గుర్తించుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ పలు పథకాలతో జనం ముందుకు వెళ్తుండగా ఇంకా కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ, తీన్మార్ మల్లన్న సైతం తమ ఉనికి చాటాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.