https://oktelugu.com/

నీలి చిత్రాలలో ‘శిల్పా శెట్టి’ పాత్ర ఎంత ?

‘శిల్పా శెట్టి’ 46 ఏళ్ళ వయసులోనూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోన్న బాలీవుడ్ క్రేజీ బ్యూటీ. అందుకే, వయసు అయిపోయాక కూడా శిల్పా శెట్టికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ ఫాలోయింగ్ కి కారణం ఆమె నిత్యం పెట్టే యోగ వీడియోలే అంటారు. ఏది అయితే ఏం శిల్పా శెట్టి అంటే ఒక బ్రాండ్. పైగా బుల్లితెరపై అనేక షోలతో బాగా సంపాదిస్తున్న క్రేజీ నిర్మాత కూడా. డబ్బు విషయంలో చాలామంది స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : July 20, 2021 / 04:33 PM IST
    Follow us on

    ‘శిల్పా శెట్టి’ 46 ఏళ్ళ వయసులోనూ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తోన్న బాలీవుడ్ క్రేజీ బ్యూటీ. అందుకే, వయసు అయిపోయాక కూడా శిల్పా శెట్టికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ ఫాలోయింగ్ కి కారణం ఆమె నిత్యం పెట్టే యోగ వీడియోలే అంటారు. ఏది అయితే ఏం శిల్పా శెట్టి అంటే ఒక బ్రాండ్. పైగా బుల్లితెరపై అనేక షోలతో బాగా సంపాదిస్తున్న క్రేజీ నిర్మాత కూడా.

    డబ్బు విషయంలో చాలామంది స్టార్ హీరోల కంటే.. ఎక్కువ ఆస్తులు ఉన్నాయి ఆమెకు. నిజానికి సినిమాల్లో హీరోయిన్ గా నటించే సమయంలో కంటే.. శిల్పా శెట్టికి ఇప్పుడు ఎక్కువ సంపాదన ఉంది. అంతా హ్యాపీ ఫ్యామిలీ. కానీ, సడన్ గా పెద్ద షాక్. శిల్పా శెట్టి భర్త ‘రాజ్ కుంద్రా’ని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం అది కాస్తా నేషనల్ రేంజ్ లో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

    అయితే, రాజ్ కుంద్రాని నీలిచిత్రాల నిర్మాణం కేసులో అరెస్ట్ చేయడమే పెద్ద షాకింగ్ విషయం. విచారణలో రాజ్ కుంద్రా ఒక యాప్ ద్వారా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడని.. తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని పోలీసులు నమ్మకంగా చెబుతున్న మాట. అయితే, ఈ వార్తతో శిల్పా శెట్టి ఇమేజ్ కి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఒకవేళ ఆమె భర్త నిజంగానే ఆ పని చేసి ఉంటే ఏమిటి పరిస్థితి ?

    శిల్పా శెట్టికి ఉన్న క్రేజ్ అండ్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మరి ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం.. శిల్పాశెట్టికి ఇది అతి పెద్ద షాక్. దీనికి తోడు ఆ నీలి చిత్రాల నిర్మాణంలో శిల్పా శెట్టికి కూడా పాత్ర ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు దొరికిన ఆధారాలను బట్టి, నీలి చిత్రాలతో శిల్పాకి ఎటువంటి సంబంధం లేదు.