టీ అమ్మిన వ్యక్తి.. మోడీపై ఒబామా ప్రశంసల జల్లు

బరాక్‌ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. రెండు టర్మ్‌ల్లో ప్రెసిడెంట్‌ ఆయన. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా ఓ పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు. Also Read: విజయవంతంగా మరో మిస్సైల్ పరీక్ష కాగా.. 2015లో టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గురించి పేర్కొన్న అంశాలను కూడా ఒబామా ఈ పుస్తకంలో రచించారు. ఒకప్పుడు […]

Written By: NARESH, Updated On : November 14, 2020 4:49 pm
Follow us on

బరాక్‌ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. రెండు టర్మ్‌ల్లో ప్రెసిడెంట్‌ ఆయన. అలాంటి వ్యక్తి మన దేశ ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా ఓ పుస్తకం రాశారు. దీనిలో ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి ప్రస్తావించారు.

Also Read: విజయవంతంగా మరో మిస్సైల్ పరీక్ష

కాగా.. 2015లో టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ గురించి పేర్కొన్న అంశాలను కూడా ఒబామా ఈ పుస్తకంలో రచించారు. ఒకప్పుడు తండ్రికి సాయం చేసేందుకు కుటుంబానికి అండగా ఉండేందుకు టీ అమ్మిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అని మోడీపై ఒబామా పొగడ్తలు కురిపించారు.

భారత చైతన్యశీలతకు సమర్థతకు పేదరికం నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ జీవితమే నిదర్శనమని పేదరిక నిర్మూలన మెరుగైన విద్య బాలికలు–-మహిళల సాధికారత వంటివాటిపై మోడీకి స్పష్టమైన లక్ష్యాలున్నాయని ఒబామా ప్రశంసించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటూనే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పాడుపడుతున్నారని అన్నారు. యోగాకు నరేంద్ర మోడీ భక్తుడని ఒబామా చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇండియా కలలను నిజం చేస్తున్నారని తెలిపారు.

Also Read: లాలూ జీవితం ఇక ముగిసినట్టేనా?

మోడీ అమెరికా పర్యటన సమయంలో తనతో కలిసి డాక్టర్ మార్టిన్ కింగ్ జూనియర్ స్మారకాన్ని సందర్శించుకున్న సందర్భాన్ని కూడా ఒబామా గుర్తు చేశారు. కోట్లాది మంది భారతీయుల సమైక్యత ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని మోడీ గుర్తించారని ఒబామా వెల్లడించారు. కాగా.. ఈ పుస్తకం నవంబర్ 17న మార్కెట్లోకి రానుంది. ఇందులోని కొన్ని కథనాలను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్