https://oktelugu.com/

దేశంలో.. తెలంగాణలో ‘హస్త’ వ్యస్తం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆరు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవుతోంది. నాయకత్వ లోపంతో ఇప్పుడు ఆ పార్టీ అభాసుపాలవుతోంది. ఇందిరాగాంధీ తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ ఇమేజీ క్రమంగా దిగుజారుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి గొప్ప నాయకులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నీలం సంజీవరెడ్డి, పీవీ, భూర్గుల, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఇలా చాలా మంది జాతీయ స్థాయి దాకా చేరారు. Also Read: తెలంగాణకు బాహుబలి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 04:07 PM IST
    Follow us on

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆరు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవుతోంది. నాయకత్వ లోపంతో ఇప్పుడు ఆ పార్టీ అభాసుపాలవుతోంది. ఇందిరాగాంధీ తర్వాత దేశవ్యాప్తంగా పార్టీ ఇమేజీ క్రమంగా దిగుజారుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి గొప్ప నాయకులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నీలం సంజీవరెడ్డి, పీవీ, భూర్గుల, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఇలా చాలా మంది జాతీయ స్థాయి దాకా చేరారు.

    Also Read: తెలంగాణకు బాహుబలి దొరికినట్లేనా..?

    ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తర్వాత పార్టీకి ప్రజలకు మధ్యం దూరం పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏ ఎన్నికల్లో చూసినా కనీసం డిపాజిట్‌ కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పుడు.. నాటి వైఎస్‌ లాంటి నేత కునుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.

    దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఉప ఉన్నికలో కనీసం పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కకపోవడంతో.. భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్నదనే అభిప్రాయం వెల్లడవుతోంది. రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్‌ను ప్రజల్లోకి తీసుకుపోడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలం చెందిందనే చెప్పొచ్చు. రాష్ట్రం ఇవ్వడం ఏమో కానీ.. రాష్ట్రం సాధించిన క్రెడిట్‌ మాత్రం టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ తీరుగులేని పార్టీగా అవతరించింది. కానీ రాష్ట్రం ఇచ్చిన పార్టీ క్రమంగా తెలంగాణ ప్రజలకు దూరం అవుతూనే ఉంది.

    Also Read: మద్యం తాగేవారికి షాకింగ్ న్యూస్.. పదేళ్లు జైలు శిక్ష..?

    రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడంతో కార్యకర్తలు నిరుత్సాహంగా మారుతున్నారు. అదే అదునుగా భావించి మిగతా పార్టీలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాయి. ప్రజల్లో కాంగ్రెస్‌పై వస్తున్న వ్యతిరేకతను, అసంతృప్తిని కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజల నుంచి దూరంగా వెళ్లడానికి అంతర్గత వివాదాలే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో మొదటి నుంచి గ్రూప్‌ రాజకీయాలు కామన్‌. అయితే అవి బహిర్గతం కావడం వల్ల ప్రజల్లో పార్టీపై విశ్వాసం పూర్తిగా కోల్పోయిందనే చెప్పొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే కారణం. రాష్ట్ర నేతల్లో ఉన్న వర్గ పోరు పార్టీని బలహీనపరిచిందనేది నిజం. దుబ్బాక ఎన్నికతో ఇది మరోసారి రుజువైంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్