దర్శకుడికి మహేష్ దీపావళి గిప్ట్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరునికెవ్వరు మూవీలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారువారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తోంది. Also Read: ‘క్రాక్’ నుంచి దీపావళి సర్ ప్రైజ్.. ‘భూమ్ బద్దల్’ సాంగ్..! ఈ మూవీ షూటింగ్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రారంభమైనా నేటికీ కూడా […]

Written By: NARESH, Updated On : November 14, 2020 4:45 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి.. సరిలేరునికెవ్వరు మూవీలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. తాజాగా పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారువారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తోంది.

Also Read: ‘క్రాక్’ నుంచి దీపావళి సర్ ప్రైజ్.. ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

ఈ మూవీ షూటింగ్ హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రారంభమైనా నేటికీ కూడా రెగ్యూలర్ షూటింగ్ నోచుకోలేదు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా కొంచెం ఆలస్యంగా మొదలు కానుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే అమెరికాకు వెళ్లాడు. అక్కడే కొన్నిరోజులపాటు ఉండనున్నాడు. క్రిస్మస్.. నూతన సంవత్సరాలు వేడుకలు జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో కుటుంబంతో కలిసి మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు మహేష్ సోషల్ మీడియాలో  చేయగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా ‘సర్కారువారిపాట’ దర్శకుడు పర్శురాంకు మహేష్ బాబు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు.

Also Read: ‘కొమురంభీం’ ప్రభంజనం. టాలీవుడ్లో సరికొత్త రికార్డు సెట్ చేసిన ఎన్టీఆర్..!

మహేష్ బాబు పంపిన బహుమతులను చూసి దర్శకుడు పర్శురాం ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటి దీపావళి ఇంతకు ముందెన్నడూ రాలేదని.. చూడలేదని.. మహేష్ బాబు తన కోసం పంపిన స్పెషల్ గిప్ట్ గురించి చెబుతూ ఎమోషన్ అయ్యాడు. అలాగే అభిమానులందరీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కాలుష్యానికి దూరంగా ఉండాలని సూచించాడు. దీపంలా మీ జీవితాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలనే ఆకాంక్షను మహేష్ బాబు వ్యక్తం చేశాడు. దీంతో అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్