TDP vs YCP: సెంట్రల్‌ జైలుకు జగన్‌ పేరు: వారెవ్వా, ఏమి సలహా !

TDP vs YCP: రాజకీయాల్లో విమర్శలు.. బాణాల్లా తగలాలి.. మాండలికాల్లో తిడితే తల ఎక్కడ పెట్టుకోవాలో అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు విమర్శలు హద్దులు దాటుతున్నాయి. అస్సలు భరించలేని విధంగా ఉంటున్నాయి. ఏంట్రా బాబూ ఈ తిట్లు అని రెండు చేతులు మూసుకునేలా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలంటే పెద్ద రొచ్చులా మారిపోయింది. బూతులు కూడా తిట్టేసుకుంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతోంది. వైసీపీని దీన్ని సమర్థించుకోవడం.. టీడీపీ […]

Written By: NARESH, Updated On : September 25, 2022 8:08 pm
Follow us on

TDP vs YCP: రాజకీయాల్లో విమర్శలు.. బాణాల్లా తగలాలి.. మాండలికాల్లో తిడితే తల ఎక్కడ పెట్టుకోవాలో అన్నట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడు విమర్శలు హద్దులు దాటుతున్నాయి. అస్సలు భరించలేని విధంగా ఉంటున్నాయి. ఏంట్రా బాబూ ఈ తిట్లు అని రెండు చేతులు మూసుకునేలా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలంటే పెద్ద రొచ్చులా మారిపోయింది. బూతులు కూడా తిట్టేసుకుంటున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతోంది. వైసీపీని దీన్ని సమర్థించుకోవడం.. టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించడం.. రోజుకొకరు చొప్పున ఇందులో పెట్రోల్ పోసి రాజేస్తుండడంతో యమ రంజుగా సాగుతోంది.

ఇప్పటికే ఈ వివాదంపై స్టార్ హీరో జూ.ఎన్టీఆర్, అగ్రహీరో నందమూరి బాలకృష్ణ స్పందించి వైసీపీ బ్యాచ్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఈ వివాదంలోకి టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేరింది. ఆమె వేసిన సెటైర్ వారెవ్వా అన్నట్టుగా ఉంది.

‘16 నెలల పాటు వైఎస్ జగన్ ఉన్న జైలుకు జగన్ లేదా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సెటైర్ వేశారు. డాక్టర్ గా సేవలందించినందుకు ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని చెప్పుకుంటున్న వాళ్లు ఈ పని కూడా చేయాలన్నారు. తండ్రి మీద ప్రేమ ఉంటే తాడడేపల్లి ప్యాలస్, హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ కు ఎందుకు వైఎస్ పేరు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు.

ఇలా అనిత లాజిక్ తో జగన్ అండ్ వైసీపీని కొట్టిన తీరు నిజంగా బాగా పేలింది. ప్రత్యర్థులను ఇరుకునపెట్టడంలో.. ఇలా టైం చూసి కొట్టడంలో నేతలు యాక్టివ్ గా ఉంటేనే ప్రత్యర్థులు డిఫెన్స్ లో పడుతారు.