Mahesh Babu SS Rajamoulis film : టాలీవుడ్ యే కాదు.. దేశమంతా ఇప్పుడ రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోంది. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నారు. మాస్టర్ ఫిల్మ్ మేకర్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పని చేస్తున్నాడు.

మహేష్ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద సినిమాగా ఇది రూపొందనుంది. ఈ హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ 2023లో నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మహేష్ బాబుతో దర్శకుడు రాజమౌళి చేస్తున్న ఈ చిత్రం కథ.. ప్రపంచాన్ని చుట్టే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని చెబుతున్నాడు. మహేష్ బాబు -ఎస్ రాజమౌళిల ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్‌వర్త్ నటిస్తున్నాడని ఇటీవల పుకారు షికారు చేస్తోంది.
మార్వెల్ సినిమాల్లో ‘థోర్’ పాత్రతో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ స్టార్ హీరో.. ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంకొందరు హాలీవుడ్ ఎ-లిస్ట్ నటీనటులు కూడా మహేష్ బాబు తారాగణంలో చేరవచ్చని చెబుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే టాప్ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సీఏఏ (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)లో చేరిన తర్వాత ఈ పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో క్రిస్ హేమ్స్‌వర్త్ ప్రమేయం గురించి రాజమౌళి కానీ చిత్రం యూనిట్ కానీ స్పందించలేదు.
ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల తన రాబోయే సినిమా ప్రాజెక్ట్ గురించి నిజాయితీగా మాట్లాడారు. పేరులేని ఈ చిత్రం జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని తెలిపారు. కానీ దాని నేటివిటీ భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటుందని వివరించాడు. యాక్షన్, థ్రిల్, డ్రామాతో కూడిన ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్‌లో మహేష్ బాబు నటించనున్నాడని అతని తండ్రి మరియు చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి హాలీవుడ్ సూపర్ స్టార్ కూడా ఎంట్రీ ఇస్తే ఇక అభిమానులకు గూస్ బాంబ్స్ ఖాయం. రాజమౌళి ఈ ప్లాన్ చేస్తే కనుక మూవీ వేరే లెవల్ లో ఉంటుందని చెప్పకతప్పదు.