YS Jagan Rule: ఏ చరిత్ర చూసినా నియంతలు చివరకు ప్రజాయుద్ధంలో ఓడిపోయారు. ప్రజలను నియంతృత్వంగా పాలించడం ఎన్నో ఏళ్లు సాధ్యం కాదు.. అటు బ్రిటీషర్లు అయినా.. ఇటు నిజాం నవాబులు అయినా.. ఇప్పుడు వర్తమాన నియంతలు కూడా ఎంతోకాలం పాలించలేరన్న వాస్తవం వెలుగుచూస్తోంది. ప్రపంచంలో నియంతలకు చోటు లేదని అర్థమవుతోంది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని పాలించిన హిట్లర్, అలాగే బ్రిటీషర్లు, జపాన్ ను పాలించిన నియంతలు అంతా యుద్ధోన్మాదంలో కొట్టుకుపోయారు. పదవులు, ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇక ఇప్పుడు చూస్తే ప్రపంచంలో నియంతలుగా పాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లు తమకు తామే జీవితకాలపు అధ్యక్షులుగా ప్రకటించుకున్నారు. ప్రపంచంలో రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకున్న వీరు ముగ్గురూ ఇప్పుడు వారి దేశాలను నియంతృత్వంగా పాలిస్తున్నారు.
అయితే చైనా అధ్యక్షుడి నిరంకుశ పాలనకు ఇప్పుడు చరమగీతం పాడడానికి రెడీ అయ్యారు. జిన్ పింగ్ ను గృహ నిర్బంధం చేసి సైన్యం పగ్గాలు చేపట్టిందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఉత్తరకొరియా అధ్యక్షుడు అమెరికా సహా పక్కనున్న దక్షిణ కొరియాతో యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నారు. యుద్ధం మొదలైతే కిమ్ జాంగ్ పనిపట్టాలని ప్రపంచదేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నియంతను హతమార్చి ఉత్తరకొరియాకు స్వేచ్ఛను ప్రసాదించాలని పాశ్చత్యదేశాలన్నీ ప్లాన్ చేస్తున్నాయి.
ఇక ఏపీలోనూ వైసీపీకి తనే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు వైఎస్ జగన్. దీన్ని ఎన్నికల కమిషన్ కూడా తప్పుపట్టింది. అలా కుదరదని ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇక తనకు మెజార్టీ ఉందని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం.. రాజకీయంగా ప్రతిపక్షాలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆధునిక నియంతలా ఎవరు విమర్శిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. జగన్ ను నియంత అని అనని వారు లేరు. పాలనలో, ప్రతిపక్షాల వేధింపుల్లో కూడా నియంతలా తనకు నచ్చింది చేస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా జగన్ తీరు ఉంటోంది. ఇప్పటికైనా ఈ నియంత ధోరణి విడనాడకుంటే అందరిలాగానే కాలగర్భంలో కలవడం ఖాయమని చెప్పకతప్పదు..