అటు కేసీఆర్, ఇటు మోడీ.. దుబ్బాకలో కాంగ్రెస్ కు షాకిచ్చిన టీడీపీ!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి చేపట్టిన నియామకాల్లోనూ ఎల్‌.రమణకే చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇక్కడ పార్టీని నమ్మేస్థితిలో కూడా ప్రజలు లేరు. Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా? మరికొద్ది రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడి […]

Written By: NARESH, Updated On : October 20, 2020 11:23 am
Follow us on

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి చేపట్టిన నియామకాల్లోనూ ఎల్‌.రమణకే చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇక్కడ పార్టీని నమ్మేస్థితిలో కూడా ప్రజలు లేరు.

Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా?

మరికొద్ది రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడి ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల ఆకస్మికంగా చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ ఉప ఎన్నికతో ఇప్పటికే రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూడా పోటీ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ దుబ్బాక ఎన్నికల్లో టీడీపీ స్టంట్‌ ఎలా ఉండబోతోంది..? ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతోంది..? అనేది ఇప్పటి వరకు ప్రశ్న. అయితే.. తాజాగా మూడో సారి అధ్యక్షుడిగా నియమితుడైన ఎల్‌.రమణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో తాము ఏ పార్టీకి మ‌ద్దతు ఇవ్వబోమ‌ని ప్రక‌టించాడు. కాంగ్రెస్ పార్టీతో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కే పొత్తు ప‌రిమిత‌మ‌ని ప్రక‌టించాడు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందన్నాడు.

Also Read: వారానికి మేల్కొన్న జగన్, కేసీఆర్?

2018లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్‌ పుట్టిమునిగిందనే అభిప్రాయాలు ఆ పార్టీలో వెల్లువెత్తాయి. ముఖ్యంగా తెలంగాణకు అడ్డుపడిన చంద్రబాబు వచ్చి ప్రచారం చేయడంతో అది పెద్ద మైనస్‌ అయింది. చంద్రబాబు ప్రచార అంశాన్నే ఎత్తుకొని కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించాడు. అందుకే.. కాంగ్రెస్‌ కూడా ఈ దుబ్బాక ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధపడింది.