
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజిరియా వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ వ్యవహారంపై కొద్ది రోజులుగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారంలో భాగంగా లంగర్‌హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న డానియల్ అనే వ్యక్తిని గుర్తించారు. నిందితుడి నుంచి 6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.