https://oktelugu.com/

‘800’ మూవీ నుంచి విజయ్ ను ఔట్ చేసిన మురళీధరన్..!

ప్రముఖ క్రికెటర్.. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా ‘800’ మూవీ తెరకెక్కుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ గా కన్పించబోతున్నాడు. అయితే ఈ బయోపిక్ పై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. Also Read: ఓటీటీల్లో హిట్టు సినిమాలు వచ్చేసినట్టేనా? ‘800’ మూవీకి సంబంధించి ఫస్టు లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ ఫస్టు లుక్కుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 11:22 AM IST
    Follow us on

    ప్రముఖ క్రికెటర్.. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా ‘800’ మూవీ తెరకెక్కుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ గా కన్పించబోతున్నాడు. అయితే ఈ బయోపిక్ పై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: ఓటీటీల్లో హిట్టు సినిమాలు వచ్చేసినట్టేనా?

    ‘800’ మూవీకి సంబంధించి ఫస్టు లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ ఫస్టు లుక్కుకు మంచి ఆదరణ లభించినప్పటికీ తమిళనాడులోని కొన్నివర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో నటిస్తుండటంపై తమిళనాడులోని రాజకీయ పార్టీల నాయకులతోపాటు పలువురు సెలబ్రెటీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    లంక తమిళులను మురళీధరన్ వంచించాడని.. శ్రీలంకలో తమిళులను ఉచకోత కోసిన రాజపక్సేకు మురళీధర్ అప్పట్లో మద్దతు ఇచ్చాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీధరన్ పై పెద్దఎత్తున ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక పలువురు సెలబ్రెటీలు సైతం విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకోవాలని కోరారు. వీరిలో దర్శకుడు భారతీరాజా కూడా ఉండటం గమనార్హం.

    Also Read: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నర్తనశాల తెరపైకి..!

    ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి ‘800’ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. తమిళనాడులో వస్తున్న వ్యతిరేకతల దృష్ట్యా మురళీధరన్ తనను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని కోరినట్లు చెప్పాడు. ఆయన విజ్ఞప్తి మేరకు ‘800’ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో వెల్లడించాడు. మురళీధరనే విజయ్ ను ఔట్ చేయగా తదుపరి బరిలో నిలిచే హీరో ఎవరా? అనే ఆసక్తి మళ్లీ మొదలైంది.