గ్యాస్ లీక్ పై కేంద్ర జోక్యం కోరుతున్న టిడిపి 

విశాఖ గ్యాస్ లీక్ వ్యవహారంలో రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వంలోని పెద్దలపై పలు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా కేంద్రం జోక్యం చేసుకోవాలని టిడిపి నేతలు స్వరం పెంచుతున్నారు. ఈ విషయమై లోతయిన దర్యాప్తు జరిపించి అసలు దోషులను వెలికి తీయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు.    తాజాగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు,  నిమ్మల రామానాయుడు లతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహితం కేంద్ర జోక్యం కోరారు.     ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ జోక్యం చేసుకుని […]

Written By: Neelambaram, Updated On : May 10, 2020 11:37 am
Follow us on

విశాఖ గ్యాస్ లీక్ వ్యవహారంలో రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వంలోని పెద్దలపై పలు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా కేంద్రం జోక్యం చేసుకోవాలని టిడిపి నేతలు స్వరం పెంచుతున్నారు. ఈ విషయమై లోతయిన దర్యాప్తు జరిపించి అసలు దోషులను వెలికి తీయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. 
 
తాజాగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతలు కింజరాపు అచ్చెన్నాయుడు,  నిమ్మల రామానాయుడు లతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సహితం కేంద్ర జోక్యం కోరారు.  
 
ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నేవీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అ ప్రమత్తం చేయడం వల్లే ప్రమాదం తీవ్రత తగ్గిందని అంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. 
 
 ‘‘ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పూర్తిగా మానవతప్పిదం. యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణం. అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వారికి అనుకూలంగా మాట్లాడడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’’ అని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.
 
కాగా, సీఎం జగన్‌ సొంత మనుషులకు చెందిన మద్యం బాటిల్స్‌ తయారు చేసే నందిని పాలిమర్స్‌, భారతి పాలిమర్స్‌ కంపెనీలకు ముడిసరకు పంపించేందుకు కంపెనీని తెరిపించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కంపెనీ తరలింపునకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపిచ్చారు.