YCP and TDP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. మాటల నుంచి చేతల వరకు వెళ్లిపోయాయి. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. విపక్షాలను కట్టడి చేసే క్రమంలో ఎంత దాకా అయినా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో అయ్యన్నపాత్రుడు జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించి గొడవకు దిగారు. దీంతో రెండు పార్టీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీనిపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. తప్పు మీదే అంటే మీదే అని ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపై ఎంపీ కనకమేడల కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై రెండు పార్టీల్లో గొడవలు పెరుగుతున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల్లో రోజురోజుకు విభేదాలు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా ప్రతిపక్షం, అధికార పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కూడా ధ్వజమెత్తుతున్నారు. దీంతో కోర్టుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టు సైతం కేటీఆర్ పై ఆరోపణలు చేయొద్దని రేవంత్ రెడ్డికి సూచించింది. దీంతో పార్టీల్లో భౌతిక దాడులు చేసుకునే వరకు వెళ్లడం సంచనలం కలిగిస్తోంది.
ఏపీలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. విపక్షాలను టార్గెట్ చేస్తూ పలు చోట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో పోలీసులకు చెడ్డ పేరు వస్తోంది. వైసీపీ, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న శైలితో గొడవలు పెరిగిపోతున్నాయి. టీడీపీ హయాంలో వైసీపీ నేతల్ని, వైసీపీ హయాంలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడం తెలిసిందే. దీంతో రాష్ర్టంలో చర్చనీయాంశంగా మారుతోంది.