వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ లో ఓ వ్యక్తిపై గ్రామ పంచాయతీ సర్పంచ్ దాడి చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్ రెడ్డి కాలితో ఎగిరి తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచ్ దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.