జనసేనతో జతకట్టేందుకు టీడీపీ కొత్త స్కెచ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, బీజేపీలు కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా ఆ పార్టీ పక్కన పెడుతోంది. దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ మరో వినూత్న ఆలోచనకు దిగింది. అది అధిష్టానం ఆలోచనో లేక స్థానిక నేతల ఆలోచనో తెలియదు కానీ.. పంచాయతీ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారి తీశాయి. ఎలాగూ బీజేపీ కలవడం లేదు కాబట్టి జనసేనను అయినా కలుపుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనట. వచ్చే ఎన్నికల […]

Written By: Rocky, Updated On : February 27, 2021 10:41 am
Follow us on


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జనసేన, బీజేపీలు కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా ఆ పార్టీ పక్కన పెడుతోంది. దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ మరో వినూత్న ఆలోచనకు దిగింది. అది అధిష్టానం ఆలోచనో లేక స్థానిక నేతల ఆలోచనో తెలియదు కానీ.. పంచాయతీ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారి తీశాయి. ఎలాగూ బీజేపీ కలవడం లేదు కాబట్టి జనసేనను అయినా కలుపుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనట. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఒంటరిగా పోటీ చేయకూడదని, జనసేనతో కలిసి వెళ్లడమే బెటర్ అన్నది చంద్రబాబు అభిప్రాయం అని తెలుస్తోంది.

Also Read: కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?

కానీ.. జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేస్తోంది. ఆ కూటమి నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పవన్ కల్యాణ్ టీడీపీ వైపు ఇప్పట్లో మొగ్గు చూపరంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విడిగా బరిలో దిగుతోంది. ఇప్పటికే అభ్యర్థిగా పనబాక లక్ష్మిని కూడా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ సమీకరణాలను మార్చాయి. అనేక ప్రాంతాల్లో జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. అలాగే టీడీపీకి అనేక పంచాయతీల్లో జనసేన మద్దతిచ్చింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగింది. పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలు జరగడంతో ఇవి పెద్దగా వెలుగు చూడలేదు. రెండు పార్టీలు కలిసి పనిచేయడంతోనే జనసేనకు ఈ స్థానాలైనా దక్కాయంటున్నారు.

Also Read: ప్రచారం కన్నా పనులే ముఖ్యం : పబ్లిసిటీని ఇష్టపడని జగన్‌

కానీ.. అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే జనసేనతో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. అధికార పార్టీ నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకోవడంతో రెండు పార్టీలు కలిసి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ఈ ప్రయోగాన్ని చాలా చోట్ల చేసినట్లు కనిపిస్తోంది. జనసేనకు పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. మరి జనసేన పార్టీ బీజేపీని వదిలి టీడీపీ పంచాన చేరుతుందా..? లేక కమలం పార్టీనే అంటిపెట్టుకొని ఉంటుందా..? అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్