టీడీపీకి షాక్.. అంగుళం భూమిని వదలని జగన్

ఒక్క అంగుళం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నా సరే.. వదలకుండా స్వాధీనం చేసుకుంటున్నారు సీఎం జగన్. విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ అక్కడ ప్రతి ఇంచు ప్రభుత్వ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్న తీరు చర్చనీయాంశమవుతోంది. Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కబ్జా చేసిన భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. డైరెక్టుగా ఉదయమే బుల్ డోజర్లతో వెళ్లి కూలగొట్టేస్తున్నారు. తెల్లవారి మీడియాకు తెలిసే సరికి […]

Written By: NARESH, Updated On : December 20, 2020 5:33 pm
Follow us on

ఒక్క అంగుళం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నా సరే.. వదలకుండా స్వాధీనం చేసుకుంటున్నారు సీఎం జగన్. విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ అక్కడ ప్రతి ఇంచు ప్రభుత్వ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్న తీరు చర్చనీయాంశమవుతోంది.

Also Read: రైతుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కబ్జా చేసిన భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. డైరెక్టుగా ఉదయమే బుల్ డోజర్లతో వెళ్లి కూలగొట్టేస్తున్నారు. తెల్లవారి మీడియాకు తెలిసే సరికి మొత్తం చదును అయిపోతోంది. కోర్టుకు వెళ్లినా పెద్దగా ఆపేందుకు అవకాశం చిక్కడం లేదు. ఇలా విశాఖలోని టీడీపీ నేతల భూములను వదలకుండా జగన్ బెంబేలెత్తిస్తున్నారు.

ఇప్పటికే విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా టీడీపీ నేతల కబంధ హస్తల్లో ఉన్న భూములను విశాఖ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేను జగన్ సర్కార్ టార్గెట్ చేసింది.

Also Read: రాష్ట్రపతి శీతాకాలం విడిది వాయిదా పడినట్టేనా?

తాజాగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎమ్మెల్యేకు చెందిన స్థలంలో ఆరు సెంట్లు గెడ్డ పోరంబోకు భూమిని కలుపుకున్నట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదయాన్నే ప్రొక్లైనర్ తో నిర్మాణాలను తొలగి౦చి హద్దులను ఏర్పాటు చేశారు రెవిన్యూ శాఖ అధికారులు. స్థలంలో ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఋషికొండ సర్వేనెంబర్ 21లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డు, కాంపౌండ్ వాలు నిర్మాణం చేసినట్టు తేల్చి ఈ చర్య తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్