AP Assembly: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నకిలీ మద్యం, పెగాసస్ వ్యవహారాలే వేదికగా అసెంబ్లీలో వివాదం ముదురుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో టీడీపీ సభ్యులు బుధవారం సభలో చిడతలు వాయిస్తూ నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిడతలు బయట కొట్టుకోవాలని సభలో కాదని హితవు పలికారు. సభా మర్యాదలకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల తీరుపై ఆక్షేపించారు. సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించకుండా ఇలా చేయడమేమిటని స్పీకర్ ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ సభ్యులు కూడా మండిపడుతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ సభ్యులు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని టీడీపీ నేతల తీరుపై గర్హించారు. టీడీపీ సభ్యులు అదే తీరుగా సభకు అడ్డు తగిలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. నీచ రాజకీయాలు మాని సలహాలు, సూచనలు చేయాలని సూచిస్తున్నారు. ఇంకా వారి వైఖరి మార్చుకోకపోతే వారికే నష్టమని హితవు చెబుతున్నారు.
Also Read: చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు.. కొడాలి నాని ఆన్ ఫైరింగ్
ఒక రోజు చిడతలు కొడుతూ మరో రోజు ఈలలు వేస్తూ సభా నిర్వహణకు అడ్డుతలుగుతున్నారు. దీంతో నకిలీ మద్యం, పెగాసస్ వ్యవహారాలపై సభలో గందరగోళం నెలకొంటోంది. టీడీపీ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారనే అంశంపై సభాసంఘం చేత విచారణ చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న నకిలీ సారా మరణాలపై కూడా సభ అట్టుడుకుతోంది.
అక్రమ మద్యానికి తెర లేపింది చంద్రబాబే అని వైసీపీ మంత్రులు నిందిస్తున్నారు. ఆయన హయాంలోనే నకిలీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి ఇప్పుడు నిందలు మాపై వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా నకిలీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో రాష్ట్రంలో శాసనసభ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.
Also Read: ఆ వ్యతిరేక ముద్ర పోగొట్టుకునేందుకు కేసీఆర్ మరో ప్లాన్