RGV Interesting Comments On The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా విడుదలైన సంచలనం సృష్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఇప్పటికే ఈ మూవీ పై ఆర్జీవీ స్పందిస్తూ.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు అన్ని మెసేజ్ చేసిన వర్మ.. తాజాగా మరో ట్వీట్ చేశాడు.
వర్మ మాటల్లోనే.. ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’ బాలీవుడ్ చరిత్రను మార్చేసింది. బాలీవుడ్ లో ఒక 7 బడా ప్రొడక్షన్ హౌస్ లు టాప్ లో ఉండటానికి తెగ పోటీపడతాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్‌లో కూర్చుంటాయో చెప్పడం కష్టం. ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్‌లో ఉన్న అపోహలను పూర్తిగా చేరిపేసింది’ అని వర్మ మెసేజ్ చేశాడు.
Also Read: టాలీవుడ్ లో రెండేళ్లుగా సినిమాలు రిలీజ్ చేయని డైరెక్టర్లు వీరే..
పైగా బాలీవుడ్ లో ఒక సినిమా హిట్ కావడానికి ఉన్న అపోహలు ఏమిటో కూడా వర్మ వివరించాడు.
హిట్ కొట్టాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్‌లో స్టార్లు లేరు)
హిట్ కొట్టాలంటే మీకు మెగా బడ్జెట్‌లు అవసరం ( కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది)
హిట్ కొట్టాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు)
హిట్ కొట్టాలంటే మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్‌లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు)
హిట్ కొట్టాలంటే మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (మూవీకి ముందు నిర్మాత గురించి ఎవరు పెద్దగా విని ఉండరు)
మీరు హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు)
ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గ్రాంట్ గా తీసుకున్నారు)
ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుంది (కాశ్మీర్ ఫైల్స్‌లో ఎటువంటి ప్రయత్నం లేదు. హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది) ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
Also Read:ఉపాసన కంటే రామ్ చరణ్ ఎన్నేళ్లు చిన్నవాడో తెలుసా..?
Recommended Video: