Directors Who Not Released Films: ఒకప్పటి లాగా హీరోలు ఫాస్ట్ గా సినిమాలు చేయట్లేదు. రెండేళ్లకు, మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్లు కూడా ఇలాగే లేటుగా సినిమాలు చేస్తున్నారు. 2021లో వస్తారనుకున్న చాలా మంది డైరెక్టర్లు నిరాశ పరిచారు. ఇలా లేటుగా సినిమాలు రిలీజ్ చేయబోతున్న డైరెక్టర్లు ఎవరెవరు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది రాజమౌళి. 2017లో బాహుబలి 2తో వచ్చిన ఆయన.. మార్చ్ 25న త్రిపుల్ ఆర్ మూవీతో వస్తున్నారు. అంటే దాదాపు ఐదేండ్ల గ్యాప్ అన్నమాట. ఇక కొరటాల శివ కూడా చివరి మూవీ 2018లో మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరుతో వచ్చాడు. ఇప్పుడు ఏప్రిల్ లో ఆచార్యతో వస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా 2020లో అల వైకుంఠపురములో చేశాడు. ఇప్పుడు మహేశ్ తో చేస్తున్న మూవీ 2023లో రానుంది.
ఏడాదిలో మూడు మూవీలు చేసే పూరీ కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. 2019లో ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన ఆయన.. లైగర్ మూవీతో వచ్చే ఆగస్ట్ 25న వస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడి కూడా చివరి సినిమా 2020లో సరిలేరు నీకెవ్వరుతో వచ్చాడు. ఇప్పుడు ఎఫ్ 3 మూవీతో మే 27న వనున్నాడు. నాగ్ అశ్విన్ కూడా 2018 మహానటితో వచ్చాడు. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ కే 2023లో విడుదల కానుంది.
Also Read: ఉపాసన కంటే రామ్ చరణ్ ఎన్నేళ్లు చిన్నవాడో తెలుసా..?
సురేందర్ రెడ్డి చివరి మూవీ సైరా 2019లో వచ్చింది. ఇప్పుడు అఖిల్ తో చేస్తున్న ఏజెంట్ మూవీ వచ్చే ఆగస్ట్ 12న వస్తోంది. వంశీ పైడిపల్లి చివరి మూవీ మహర్షి 2019లో వచ్చింది. ప్రస్తుతం ఆయన తమిళ హీరో విజయ్‌తో ఓ మూవీ చేస్తున్నారు. ఇది 2023లో వస్తోంది. 2019లో వెంకీ మామ మూవీతో పలకరించిన బాబీ.. ప్రస్తుతం చిరంజీవితో ఓ మూవీ చేస్తున్నాడు. 2023లోనే ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.
యాక్షన్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇంటిలిజెంట్ మూవీ ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీకి దూంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన ఛత్రపతి హిందీ రీమేక్ మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కాబోతోంది. ఇక పరశురామ్ కూడా నాలుగేళ్ల కింద గీత గోవిందంతో వచ్చాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మే 12న రాబోతున్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా మూడేళ్ల కిందట గద్దలకొండ గణేష్ మూవీతో వచ్చాడు. ప్రసత్తుం ఆయన పవన్ తో భవదీయుడు భగత్‌సింగ్ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది.
Also Read: ఒక్క హిట్ తో హీరోలు, డైరెక్టర్ల లైఫ్ ను మార్చేసిన మూవీలు ఇవే..
Recommended Video: