https://oktelugu.com/

హిందూపురం వేదికగా బాలయ్య స్టేట్‌ పాలిటిక్స్‌

నందమూరి బాలకృష్ణ ఏది చేసినా డిఫరెంట్‌. సినిమాల్లో డైలాగులు పేల్చాలన్నా.. రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇవ్వాలన్నా ఆయనకే ఆయనే సాటి. అయితే.. ఇన్నాళ్లు అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు అంటూ నడిచారు. ఇప్పుడు సడన్‌గా ఆయన రూటు మార్చారు. ఇక ఫుల్‌ టైం రాజకీయాల్లో ఉండిపోవాలని డిసైడ్‌ అయ్యారట. అందుకే.. హిందూపురంను వదిలి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. Also Read: తిరుపతి బైపోల్‌లో గ్లామర్‌‌ షో అందుకే.. వైసీపీని టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నానికి […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 9, 2021 / 03:39 PM IST
    Follow us on


    నందమూరి బాలకృష్ణ ఏది చేసినా డిఫరెంట్‌. సినిమాల్లో డైలాగులు పేల్చాలన్నా.. రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇవ్వాలన్నా ఆయనకే ఆయనే సాటి. అయితే.. ఇన్నాళ్లు అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు అంటూ నడిచారు. ఇప్పుడు సడన్‌గా ఆయన రూటు మార్చారు. ఇక ఫుల్‌ టైం రాజకీయాల్లో ఉండిపోవాలని డిసైడ్‌ అయ్యారట. అందుకే.. హిందూపురంను వదిలి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

    Also Read: తిరుపతి బైపోల్‌లో గ్లామర్‌‌ షో

    అందుకే.. వైసీపీని టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నానికి కౌంటర్లు వేయడానికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. సినిమా హీరోగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వరసగా రెండోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. బాలకృష్ణ దేనినీ సీరియస్‌గా తీసుకోరనే ప్రచారం ఉంది. ఒకవేళ సీరియస్‌గా తీసుకుంటే మాత్రం ఆ సీన్‌ వేరేలా ఉంటుందని టాక్‌. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పుడు విపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా రాజకీయాలు ఆయనకు పార్ట్‌ టైమ్‌ అని భావించేవారు. అలాంటి బాలకృష్ణ ఒక్కసారిగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.

    ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మూడు నెలలకోసారి మూడు రోజులపాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించే వారు. హిందూపురం పాలిటిక్స్ తప్ప ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. కానీ.. ఈ సారి మాత్రం రూట్ మార్చారు. హిందూపురం కేంద్రంగానే స్టేట్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. రైతు సమస్యల దగ్గరి నుంచి విగ్రహాల కూల్చివేత వరకు అన్నింటిపైనా బాలయ్య స్పందిస్తున్నారు. వైసీపీపై ఒక రేంజ్‌లో ఫైర్ అవుతూ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నారు.

    Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట

    ఇప్పుడు విగ్రహాల కూల్చివేత, పేకాట వంటి విషయాలపై కూడా బాలయ్య రియాక్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఆలయాలకు కూడా రక్షణ కల్పించలేకపోతోందని.. తమ ప్రభుత్వం హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని.. ఒకవేళ అలా చేసినా అది ప్రజా ప్రయోజనం, ప్రజా మద్దతుతోనే చేశామని చెప్పుకొచ్చారు. అలాగే టీడీపీపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసే నానికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్