Homeఆంధ్రప్రదేశ్‌Mahanadu: పసుపు పండుగ మహానాడుకు ఆ సంవత్సరాల్లో బ్రేక్? ఎందుకంటే?

Mahanadu: పసుపు పండుగ మహానాడుకు ఆ సంవత్సరాల్లో బ్రేక్? ఎందుకంటే?

Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రధాన పండుగ ‘మహానాడు’. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత అధినేత ఎన్టీ రామారావు జన్మదినం సందర్భంగా ఏటా మే 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది.. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివస్తారు. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారవుతుంది. 1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు.

Mahanadu
Mahanadu

ఇందులొ 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2018 లో జరిగిన మహానాడు చివరిసారి సెషన్లలో, పార్టీ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్ట్, ఐటి, దాని ప్రమేయం, నీటి మెరుగుదల, రైతుల అభ్యున్నతి, రాజకీయాలలో మహిళల ప్రమేయం, సాధికారత మొదలైన వాటి గురించి చర్చించింది. 2019లో సార్వత్రిక ఎన్నికలు, తరువాత రెండు సంవత్సరాలు కొవిడ్ తో మహానాడు నిర్వహించలేదు. మూడేళ్ల విరామం తరువాత ఈ ఏడాది మహానాడు నిర్వహిస్తున్నారు.

Also Read: MLC Anantha Udaya Bhaskar: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను వైసీపీ ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు?

ఒంగోలు నగరం ముస్తాబు
ఈ ఏడాది మహానాడుకు ఒంగోలు నగరం, మండువవారిపాలెం ముస్తాబైంది. వారం రోజులుగా పనులు కొనసాగుతుండగా, రెండురోజుల నుంచి ఏర్పాట్లు మరింత పుంజుకున్నాయి. మహానాడు జరిగే ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. చకచకా జరుగుతున్న మహానాడు పనులను రాష్ట్ర, జిల్లాస్థాయి ముఖ్యనేతలు ఒకవైపు పరిశీలిస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివచ్చి ప్రాంగణాన్ని సందర్శిస్తున్న టీడీపీ కార్యకర్తలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం ఒంగోలు వేదికగా జరగనున్న విషయం విధితమే. నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే వేదికపై తొలిరోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగసభ జరగనుంది.

Mahanadu
chandrababu naidu

దాదాపు 12 వేలమంది కూర్చోనే విధంగా ప్రతినిధుల సభ షెడ్డు, దానికి దక్షిణం వైపు రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు మీడియా సెంటర్ల ఏర్పాటుకు నిర్మాణాలు పూర్తయ్యాయి. వేదిక నిర్మాణం చేస్తున్నారు. కొద్దిదూరంలో వేలాది మందికి భోజన సౌకర్యం కల్పనకు వీలుగా తాత్కాలికంగా కర్రల షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రతినిధులకు ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్లు, అలాగే ప్రాంగణానికి దగ్గరలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అవి కూడా ఒక కొలిక్కి రాగా కీలకమైన ఆయా షెడ్లు అలంకరణ ఇతరత్రా బుధవారం సాయంత్రానికి పూర్తిచేసేలా పనులు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన ఇద్దరు, ముగ్గురు కీలక వ్యక్తులు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Also Read:America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం.. ఎందుకీ ఉన్మాదం?
Recommended videos
కోనసీమ కోసం రంగంలోకి దిగిన పవన్ | Pawan Kalyan at Gannavaram Airport | Dr Br Ambedkar Konaseema Dist
కోడి కత్తి కేసు ఎక్కడి దాకా వచ్చింది.? | Pawan Kalyan Questions Home Minister |Jagan Kodi Kathi Case
అంబేద్కర్ ని రాజకీయంగా వాడుకుంటున్నారు || Pawan Kalyan Comments on Konaseema Dist Issue

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version