Nayantara Marriage: హీరోయిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి.. కుల దైవం గుడిలో పూజలు !

Nayantara Marriage: నయనతార పెళ్లి పై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి పనులతో నయనతార ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. అలాగే, పెళ్లికి ముందు చేయాల్సిన పూజలను కూడా న‌య‌నతార చేయిస్తోంది. తాజాగా తంజావూరులోని పాప‌నాశంలో మేల్ మ‌ర‌తురు గ్రామంలో అమ్మ‌వారు ఆల‌యాన్ని సంద‌ర్శించింది ఈ జంట. ఈ అమ్మవారు న‌య‌నతార కుల దైవం అట. చిన్నతనం నుంచి ఈ […]

Written By: Shiva, Updated On : May 25, 2022 5:34 pm
Follow us on

Nayantara Marriage: నయనతార పెళ్లి పై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి పనులతో నయనతార ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. అలాగే, పెళ్లికి ముందు చేయాల్సిన పూజలను కూడా న‌య‌నతార చేయిస్తోంది. తాజాగా తంజావూరులోని పాప‌నాశంలో మేల్ మ‌ర‌తురు గ్రామంలో అమ్మ‌వారు ఆల‌యాన్ని సంద‌ర్శించింది ఈ జంట.

Nayanthara and Vignesh Shivan

ఈ అమ్మవారు న‌య‌నతార కుల దైవం అట. చిన్నతనం నుంచి ఈ అమ్మ వారిని నయనతార పూజిస్తారు. అందుకే.. పెళ్లికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది ఈ బ్యూటీ. ఈ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు కూడా నిర్వ‌హించింది. అన్నట్టు నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతుంది. వేదిక‌తో పాటు ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయ్యింది. జూన్ 9న రాత్రి 10 గంటలకు న‌య‌నతార పెళ్లి తిరుప‌తిలో జ‌రగ‌బోతోంది.

Also Read: Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ 13 రోజుల కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే, నయనాతర మాత్రం తన పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. తన పెళ్లి విషయంలో నయనతార ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే, గతంలో నయనతార ‘స్టార్ విజయ్ టెలివిజన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇంతకీ, నయనతార.. తన పెళ్లి గురించి ఏమి మాట్లాడింది అంటే.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి.. ఇది నా నిశ్చితార్థం రింగే.

పెళ్లి కుమారుడు విగ్నేష్ శివనే. మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు. నిశ్చితార్ధానికి ఎవరిని పిలవక పోవడానికి కారణం.. నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు. అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా జరువుకున్నాం.

Nayanthara and Vignesh Shivan

ఇక పెళ్ళి కూడా అలాగే చేసుకుంటాం’ అంటూ నయనతార చెప్పుకొచ్చింది. కాబట్టి, పెళ్లి కూడా అయ్యిపోయాక, సింపుల్ గా మా పెళ్లి అయిపోయిందని చెబుతుందేమో. ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరి జూన్ 9న అయినా నయనతార పెళ్లి అవ్వాలని ఆశిద్దాం.

Also Read:Tollywood Heros: తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
Recommended videos


Tags