ఎన్నికల వేళ తమ్ముళ్ల ఆధిపత్య పోరు

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రతిపక్ష పాత్రలో ఉన్న టీడీపీలోనూ గ్రూపు రాజకీయాలు వీడడం లేదు. టీడీపీలో తమ్ముళ్ల మధ్య గ్రూపుల రగడ నడుస్తూనే ఉంది. ఇది కాస్త అధినేత చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. బెజవాడ సిటీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాల మధ్య కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, తలెత్తిన వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. Also Read: హిందూపురంలోనూ అధికార పార్టీదే […]

Written By: Srinivas, Updated On : February 22, 2021 2:39 pm
Follow us on


ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రతిపక్ష పాత్రలో ఉన్న టీడీపీలోనూ గ్రూపు రాజకీయాలు వీడడం లేదు. టీడీపీలో తమ్ముళ్ల మధ్య గ్రూపుల రగడ నడుస్తూనే ఉంది. ఇది కాస్త అధినేత చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. బెజవాడ సిటీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాల మధ్య కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, తలెత్తిన వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Also Read: హిందూపురంలోనూ అధికార పార్టీదే హవా : బాలయ్యా.. ఇది ఏందయా..!

39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో వీరి మధ్య వివాదం చోటు చేసుకోవడమే కాకుండా బహిరంగ వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఈ పరిణామాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నేతల పరస్పర విమర్శలతో పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి సహించేది లేదని హెచ్చరించారు. ఇక 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చూసుకుంటారని పేర్కొన్నారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయంలో కేశినేని నానికి , బుద్దా వెంకన్నకు మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మేయర్ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కేశినేని నాని కూతురు శ్వేత పార్టీ నాయకత్వం మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసిందని ప్రచారం జరుగుతుంటే, ప్రత్యర్థి వర్గమైన వెంకన్న వర్గం ఆ ప్రచారాన్నిఖండిస్తూ వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. దీంతో చంద్రబాబు బహిరంగ విమర్శలు చేసుకోవడం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం చేస్తే సహించేది లేదని నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజా పరిణామాలతో టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు కాస్త ఇప్పుడు బహిర్గతమై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో దేవినేని ఉమా, వల్లభనేని వంశీల మధ్య రగడ వల్లభనేని పార్టీ వీడి వెళ్లడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు

Also Read: పులివెందులలో వైసీపీ క్లీన్‌స్వీప్‌

అసలే ముందు ముందు రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే.. పార్టీ నేతలను సమన్వయపరిచి ఏకతాటిపైకి తీసుకురావడానికి నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కేశినేని నానికి, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ తదితరులకు మధ్య దూరం పెరుగుతోందని గుర్తించిన చంద్రబాబు అందరినీ సమన్వయ పరచడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్