వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 24 విడతలుగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరాయి. దీనంతటికి కారణం ట్యాక్స్‌ల మోతనే అని తెలుస్తోంది. ట్యాక్స్‌ల మోతతో పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అటు ఎక్సైజ్, ఇటు వ్యాట్‌ల రూపంలో ప్రభుత్వాలు బాదుడుకు దిగడంతో కొన్ని సిటీల్లో ఇప్పటికే సెంచరీ కొట్టిన పెట్రోల్, దానితోపాటే డీజిల్ మోయలేని బరువుగా మారుతున్నాయి.
Also Read: దీదీపై కేంద్రం సీబీఐ అస్త్రం
పెట్రోల్ పంపుల్లోని రిటెయిల్ రేట్లలో 67 శాతం దాకా ట్యాక్స్‌లే ఉంటున్నాయంటే పరిస్థితి క్లియర్‌గా అర్థమవుతోంది. కరోనా క్రైసిస్‌తో ఆదాయం పెంచుకునేందుకు పెట్రోల్, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ను పెంచగా, తామేమీ తక్కువ తినలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను పెంచేశాయి. దీంతో ఇంటి నుంచి కదలాలంటే వెహికల్ తప్పనిసరైన మిడిల్ క్లాస్ ప్రజలకు దిక్కుతోచడం లేదు. కిందటేడాది అక్టోబర్ నుంచీ చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ రేట్లు పెరిగిన మాట నిజమే. కానీ.. ఆ భారాన్ని కొంతైనా ప్రజల మీద తగ్గించాలంటే ట్యాక్స్‌లను ప్రభుత్వాలు తగ్గించాలని, జీఎస్‌టీ కిందకైనా పెట్రోల్, డీజిల్‌లను తేవాలనే డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి. జీఎస్‌టీ కిందకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ససేమిరా అంటుండటం వల్ల అది వీలవడం లేదు. 2014 దాకా పెట్రోల్, డీజిల్‌ల రిటెయిల్ రేటులో ట్యాక్స్‌ల మోత 45 శాతంగా ఉండేది.
* కరోనా టైమ్‌లోనూ ట్యాక్సుల మోత
కరోనా టైమ్‌లో ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ పెంచింది. ఇప్పుడూ అదే డ్యూటీ కొనసాగుతుండటంతో భారం ఎక్కువవుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడాయిల్రేట్లు కుప్పకూలాయి. మనదేశంలో మాత్రం ట్యాక్సుల కారణంగా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ధరలో 67 శాతం ఎక్సైజ్ సుంకం కాగా, ముడి చమురు ధర కేవలం 33 శాతమని రిటైలర్లు చెబుతున్నారు. క్రూడ్ కోసం మన దేశం కంటే ఎక్కువగా ఇతర దేశాల మీదే ఆధారపడటం వల్ల రేట్ల విషయంలో వెసులుబాటు దొరకడం లేదు. దేశపు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే నెరవేరుతోంది. దీనికోసం విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్‌ని వెచ్చించాల్సి వస్తోంది. చమురు వెలికితీత విషయంలో సొంత కాళ్లపై నిలబడేందుకు గత ప్రభుత్వాలు కృషి చేయకపోవడం వల్లే ఈ సిట్యుయేషన్ ఎదురవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే చెప్పారు. కిందటి ఏడాది అక్టోబర్ నుంచి ఇంటర్నేషనల్ క్రూడ్ రేట్లు 50 శాతం పైగా పెరిగి ప్రస్తుతం బ్యారెల్‌కు 63.8 డాలర్లకు చేరాయి. కరోనా క్రైసిస్ నేపథ్యంలో 82 రోజులపాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ రేట్లను రోజువారీగా పెంచడం మానేశాయి. మళ్లీ మొన్న జనవరి నెల నుంచే రేట్లను డెయిలీ సవరించడం మొదలెట్టాయి. అప్పటి నుంచీ పెట్రోలు, డీజిల్ రేట్లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: చైనా సైన్యానికి ధీటుగా బదులిచ్చిన భారత బెబ్బులి ఎవరో తెలుసా?
* ప్రభుత్వం ఏమంటోందంటే
గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్లే పెట్రోల్రేట్లు భారంగా మారాయని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది. అప్పటి ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని చెబుతోంది. కరోనా వల్ల ద్రవ్యలోటు విపరీతంగా పెరిగింది. దానిని పూడ్చుకోవాలంటే పన్నులను ఎప్పట్లాగే కొనసాగించడం మినహా వేరే మార్గమే లేదని స్పష్టం చేసింది. ‘‘ఇది వరకటి ప్రభుత్వం చమురు కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడంపై ఫోకస్చేయలేదు. మనం వాడే ఫ్యూయల్లో 85 శాతం విదేశాల నుంచే వస్తోంది. గత ప్రభుత్వాలు చమురు ప్రొడక్షన్పెంచి ఉంటే ఇప్పుడు మిడిల్క్లాస్ పై భారం ఉండేదే కాదు. పెట్రోల్కు బదులు ఉపయోగించగల ఇథనాల్ప్రొడక్షన్ పెంపుపై మేం ఫోకస్ చేస్తున్నాం. దీనివల్ల కన్జూమర్లు, చెరుకు రైతులకూ మేలు జరుగుతుంది” అని ఆయన వివరించారు.
* జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్
నేచురల్గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రకటించారని, పెట్రోల్, డీజిల్పైనా జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలని కన్జూమర్లు కోరుతున్నారు. అయితే.. నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే తేదీని ఆయన వెల్లడించలేదు. పెట్రో ప్రొడక్టులపై కేంద్రంతోపాటు రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ప్రధాన ఆదాయ వనరుల్లో దీనిని ఒకటిగా చూస్తున్నాయి. అందుకే లిక్కర్‌తోపాటు పెట్రో ప్రొడక్ట్స్‌ను జీఎస్టీ నుంచి మినహాయించాయి. ఇప్పుడు పెట్రోల్ లీటరు రూ.100కు చేరుకుంటున్న సమయంలో జీఎస్టీ సిస్టమ్లోకి తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ఇది అంత సులువు కాదని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఒకేసారి అన్ని పన్నులను రద్దు చేసి, జీఎస్టీ మాత్రమే వసూలు చేయడం కష్టమని వాదిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్