https://oktelugu.com/

స్థానిక సంస్థలకు రీ నోటిఫికేషన్ కోసం పట్టుబడుతున్న జనసేన: ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ హ్యాపీగా ఉంది. ఇక తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ ఎన్నికలకు సంవత్సరం కిందే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్తామని ఈసీ ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని పట్టుబడుతున్నాడు. నిన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 02:36 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ హ్యాపీగా ఉంది. ఇక తరువాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఈ ఎన్నికలకు సంవత్సరం కిందే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్తామని ఈసీ ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని పట్టుబడుతున్నాడు.

    నిన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో జనసేన మద్దతుదారులు గెలిచారు. దీంతో ఆ పార్టీకి కొంత ఊపు వచ్చినట్లయింది. ఇక ఏ ఎన్నికలయినా ఇలాగే పనిచేస్తే పార్టీ పటిష్టత్వముంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత చాలా రోజులు ఫాంహౌజ్ లో ఉన్న పవన్ ఆ తరువాత ప్రజలతో కలిసిపోతున్నారు. ముఖ్యంగా రైతుల తరుపున పోరాడుతూ వస్తున్నారు.

    అమరావతి విషయంలో రాజధానిని మార్చవద్దని నిర్ణయం తీసుకున్న పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఆయనకు కొన్ని చోట్ల ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఇక ఇలాగే ప్రజల తరుపున పోరాడితే వచ్చే అసెంబ్లీ వరకు పార్టీని బలపర్చవచ్చని వ్యూహం పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని అందరికంటే ముందుగా వాదిస్తున్నారు.

    గతంలో నోటిఫికేషన్ విడుదలయిన తరువాత కొందరిని బెదిరించి నామినేషన్లు వేయకుండా చేశారని పవన్ ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు పైకి అలా బెదిరిస్తే ఫిర్యాదు చేయాలని సూచించాన్నారు. అయితే ఫిర్యాదులు చేసిన వారిని పట్టించుకోలేదన్నారు. దీంతో మళ్లీ నోటిఫికేషన్ వేస్తే స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఇదిలా ఉండా ఈసీ సైత పాత నోటిఫికేషన్తోనే ఎన్నికలకు వెళ్లడంపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేశ్ ఇప్పటికైనా రీ నోటిఫికేషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.