బాబు పెద్ద స్కెచ్చే వేస్తున్నారుగా..!

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సీజన్‌ మొదలైంది. దీంతో టీడీపీ మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఈ దూకుడును మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అయితే.. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నిన్నా జనాల్లో మాత్రం పెద్దగా పాజిటివ్‌ వాతావరణం కనిపించడం లేదు. ప్రజలు అంత సులువుగా టీడీపీని నమ్మే పరిస్థితుల్లో లేరు. మరోవైపు.. పార్టీలోనూ విభేదాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి ఉండడంతో ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 3:04 pm
Follow us on


ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సీజన్‌ మొదలైంది. దీంతో టీడీపీ మంచి దూకుడు మీద కనిపిస్తోంది. ఈ దూకుడును మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అయితే.. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నిన్నా జనాల్లో మాత్రం పెద్దగా పాజిటివ్‌ వాతావరణం కనిపించడం లేదు. ప్రజలు అంత సులువుగా టీడీపీని నమ్మే పరిస్థితుల్లో లేరు. మరోవైపు.. పార్టీలోనూ విభేదాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా నియోజకవర్గాల్లో నాయకత్వ లేమి ఉండడంతో ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది.

Also Read: జగన్ చేతికి చిక్కిన ‘నిమ్మగడ్డ’

ఈ ప‌రిణామాలే గ‌త సాధార‌ణ‌ ఎన్నిక‌ల్లో పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక.. ఇప్పుడు పంచాయ‌తీ పోరులోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఎద‌ర‌య్యే సూచ‌న‌లే క‌నిపిస్తున్నాయి. ఆ మాట‌కు వ‌స్తే 47 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జీలు ఏ మాత్రం యాక్టివ్‌గా లేర‌ని చంద్రబాబు ఇటీవ‌ల స్వయంగా చెప్పారు. మొత్తంగా చూస్తే టీడీపీకి ఆశించిన‌ మేర‌కు ఫ‌లితం ద‌క్కేలా క‌నిపించ‌డం లేదు. బ‌హుషా ఈ విష‌యం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసిపోయిందో ఏమో వెంట‌నే ఆయ‌న ప్లేట్ మార్చారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ.. చంద్రబాబు మౌనం వెనక అంతర్యం ఏమిటీ..?

టీడీపీ మెజారిటీ మద్దతుదారులను గెలవలేకపోయినా లేక‌..వైసీపీ సాధార‌ణ ఎన్నిక‌ల్లో లాగానే వార్ వ‌న్ సైడ్ చేసి భారీ సంఖ్యలో పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకున్నా.. టీడీపీని ర‌క్షించుకునే మార్గం దిశ‌గా చంద్రబాబు ఆలోచ‌న చేస్తున్నారు. అదే ఇప్పుడు పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి కూడా రాజ‌కీయ వ్యూహాలు వేయ‌డంలో చంద్రబాబు త‌న‌కు తానే సాటి. ఇక‌.. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ అనుకూలురు భారీ సంఖ్యలో పంచాయ‌తీలు కైవ‌సం చేసుకుంటే వైసీపీపై రెండేళ్లు రాకుండానే వ్యతిరేక‌త పెరిగిపోయింద‌ని.. జ‌గ‌న్ పాల‌న‌కు వ్యతిరేక‌త‌గా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమ‌య్యారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇదిలా ఉంటే.. అదే స‌మ‌యంలో రేపు టీడీపీకి వ్యతిరేక‌త వ‌స్తే.. బ‌ల‌వంత‌పు ఏక‌గ్రీవాలు చేయించార‌ని, ఎన్నిక‌ల్లో అవినీతి చోటు చేసుకుంద‌ని.. ఇలా జ‌గ‌న్‌పై నింద‌లు వేసేందుకు టీడీపీ బ్యాచ్‌ రెడీ అయిపోయింది. మ‌రోవైపు పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవాలు స‌హజం. అయితే.. ఇలా జ‌రిగేందుకు ఛాన్స్ ఇవ్వొద్దంటూ టీడీపీ నేత‌ల‌ను చంద్రబాబు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. రిజల్ట్స్‌ ఎలా వచ్చినా వాటిని తమకు పాజిటివ్‌గా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు చంద్రబాబు.