https://oktelugu.com/

Amaravati: టీడీపీ నేతలు తగ్గితేనే ‘అమరావతి’ సజీవం.. లేకుంటే కష్టమే..

Amaravati: రాష్ట్రం రాజధాని లేకుండా నడిబొడ్డున నిలబడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి.. పూర్తిగా ప్రశ్నార్థకంగా మార్చింది. మూడేళ్ల పాలనలో తాను అనుకున్న మూడు రాజధానులపై అడుగు ముందుకేయలేక.. అటు అమరావతిని అభివ్రుద్ధి చేయక వైసీపీ ప్రభుత్వం నాన్చుడి ధోరణితో ముందుకెళ్లింది. ప్రజలకు పప్పు బెల్లం పెట్టి నోరు మూయించింది. అయితే అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. అమరావతికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. […]

Written By: , Updated On : June 29, 2022 / 11:46 AM IST
Follow us on

Amaravati: రాష్ట్రం రాజధాని లేకుండా నడిబొడ్డున నిలబడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యం చేసింది. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి.. పూర్తిగా ప్రశ్నార్థకంగా మార్చింది. మూడేళ్ల పాలనలో తాను అనుకున్న మూడు రాజధానులపై అడుగు ముందుకేయలేక.. అటు అమరావతిని అభివ్రుద్ధి చేయక వైసీపీ ప్రభుత్వం నాన్చుడి ధోరణితో ముందుకెళ్లింది. ప్రజలకు పప్పు బెల్లం పెట్టి నోరు మూయించింది. అయితే అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. అమరావతికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అమరావతిలో మౌలిక వసతులకల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో అమరావతిలో మౌలిక వసతులకల్పన ప్రభుత్వానికి అనివార్యంగా మారింది. అయితే ఇప్పటికే అమరావతికి జరగరాని నష్టం జరిగిపోయింది. కోర్టు ఆదేశాలతో తప్పించి అమరావతిని అభివ్రుద్ధి చేయడం జగన్ సర్కారుకు ఇష్టం లేదు. తప్పనిసరై అమరావతి విషయంలో అమాత్రం హడావుడి చేస్తోంది. ఈ సమయంలో విపక్షాలు కూడా వెనక్కి తగ్గితే అమరావతికి మేలు చేసిన వారవుతారు. ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో ఎంత తగ్గితే అంత మంచిది. ఇప్పటికే వైసీపీ సర్కారు అమరావతి విషయంలో కదలికలు ప్రారంభించింది. అక్కడి భూములు, భవనాల వినియోగంపై ద్రుష్టిసారించింది. వాటిని విక్రయించో, లీజుకిచ్చో ఆదాయం సమకూర్చుకోవడానికి, ఇతర అభివ్రుద్ధి పనులు చేపట్టాలని భావిస్తోంది. ఈ సమయంలో మాత్రం టీడీపీ అడ్డుతగిలితే దానికి సాకుగా చూపి వైసీపీ సర్కారు మరోసారి దాటవేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే అమరావతి విషయంతో తనతో పాటు నేతల మాటలను కట్టడి చేయాలని చంద్రబాబుకు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Amaravati

Amaravati

నాడు అనుమానాలెన్నో..
వాస్తవానికి అమరావతి పురుడు పోసుకోవడం వెనుక అనేక అనుమానాలున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల పాత్రపై అనేక ఆరోపణలున్నాయి. రాజధాని ప్రకటన ముందే భారీగా భూములు కొన్నారన్న ఆరోపణలైతే వచ్చాయి. అయితే ఇందులో చాలావరకూ నిజం ఉంది. చంద్రబాబుకు సైబరాబాద్ నిర్మించిన చరిత్ర ఉంది. అప్పట్లో ఆ ప్రాంతంలో భూములున్న వారు.. భూములు కొన్నవారు బాగా లాభపడ్డారు. అందుకే చంద్రబాబును నమ్మి.. ఆయన సామాజికవర్గంతో పాటు హైదరాబాద్ సెటిలర్స్ సైతం భూములు కొన్నారు.

Also Read: Mysore Sandal Success Story: మైసూర్ సాండిల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఆశ్చర్యపోతారు!

తొలినాళ్లలో రూ.10 లక్షలకు లభించే భూమి.. రాజధాని ప్రకటన తరువాత కోట్లాది రూపాయలకు చేరుకుంది. ఇదంతా కేవలం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. మరోవైపు తమకు మంచి భవిష్యత్ చూపుతారన్న నమ్మకంతో అమరావతికి 33 వేల ఎకరాలను రైతులు అప్పగించారు. ఈ ప్రాంతం ఎంతగానో అభివ్రుద్ధి చెంది తమ భూములకు విలువ వస్తుందని ఆశించారు. కానీ అనుకున్నది ఒకటి.. జరిగింది మరోకటి అన్నట్టు రాష్ట్రంలో అధికార మార్పిడితో వారు ఆశలు.. అడియాశలయ్యాయి. మూడేళ్లుగా వారు అనుభవిస్తున్న వ్యధ అంతా ఇంతా కాదు. అందుకే సుదీర్ఘ పోరాట బాటను ఎంచుకున్నారు. దీంతో న్యాయస్థానంలో వారికి కొంత న్యాయం జరిగింది. మూడేళ్లుగా మరుగునపడిపోయిన అమరావతి మళ్లీ పురుడు పోసుకుంది.

అడ్డుపడితే నిష్ఫలం..
కోర్టు ఆదేశాల మేరకు అమరావతి విషయంలో వైసీపీ సర్కారు తన చర్యలను, కదలికలను ప్రారంభించింది. సహజంగా అమరావతి అంటే ఇష్టం లేదు కనుక.. అయిష్టంగానే నిధుల వేట ప్రారంభించింది. బ్యాంకులకు రుణం అడిగినా వారు ప్రభుత్వానికి ష్యూరిటీ ఇమ్మని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అందుకే అమరావతి భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవడానికి రాజధాని ప్రాంత అభివ్రుద్ధి అథారిటీ సంస్థ (సీఆర్డీఏ) ప్రయత్నాలు ప్రారంభించింది. 600 ఎకరాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ భవనాలను అద్దెకివ్వాలని సైతం యోచిస్తోంది. రైతులు అందించిన భూములు మీదుగా రహదారులు నిర్మించాలని భావిస్తోంది.

Amaravati

Amaravati

కానీ ప్రధాన విపక్షనేత చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు మాత్రం దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వెళుతోంది. కానీ అమరావతి అన్నది సజీవంగా ఉండాలంటే అడ్డుచెప్పడం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికే అమరావతిని కొందరు వైసీపీ నేతలు స్మశానంతో పోల్చారు. వారంటున్నది నిజమే. సాయంత్రం 6 గంటల తరువాత ఆ ప్రాంతంలో మనుషులు కనబడరు. ఇటువంటి సమయంలో అక్కడ మనుషుల రాకపోకలు, ప్రైవేటు సంస్థల నిర్వణ ఉంటేనే అమరావతి యాక్టివ్ అవుతుంది. అక్కడ జరిగిన అభివ్రుద్ధి పనులు బయట ప్రపంచానికి తెలుస్తాయి. వైసీపీ నేతలు అన్నట్టు అది భ్రమరావతి కాదు.. మంచి ప్రాంతమని నలుగురికీ తెలుస్తుంది. అలాగని టీడీపీ నాయకులు అడ్డుకుంటే మాత్రం వైసీపీ సర్కారు మొండిగా వ్యవహరించి పనులు నిలిపివేసే ప్రమాదముంది. అందుకే టీడీపీ నేతలు ఎంత తగ్గితే అంతగా అమరావతికి ప్రయోజనం చేసిన వారవుతారు.

Also Read:AP Employees PF Money: ఆ లెక్క సరిచేసేందుకు ‘జీపీఎఫ్’ నగదు మాయం.. ఉద్యోగుల్లో కలవరం

Tags