https://oktelugu.com/

The Warrior Trailer Review: అటు ఎమోషన్స్ ఇటు యాక్షన్.. ఎక్స్ లెంట్

The Warrior Trailer Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. వరల్డ్ వైడ్‌గా జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా టీమ్ ప్రకటించింది. ఐతే, ఇప్పటికే ట్రైలర్ ను రఫ్ కట్ చేసి చూసుకున్నారు. ఎడిటర్ రూమ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం… ‘ది వారియర్’ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 11:28 AM IST
    Follow us on

    The Warrior Trailer Review: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. వరల్డ్ వైడ్‌గా జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా టీమ్ ప్రకటించింది. ఐతే, ఇప్పటికే ట్రైలర్ ను రఫ్ కట్ చేసి చూసుకున్నారు. ఎడిటర్ రూమ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం… ‘ది వారియర్’ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట ఒక్కటే.. ఎక్స్ ల్లెంట్ అని.

    Ram Pothineni

    నిజంగానే ‘ది వారియర్’ ట్రైలర్ ను కట్ చేయడం కత్తిమీద సాము లాంటిది. అటు ఎమోషన్స్ ను, ఇటు యాక్షన్ ను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ చేసిన షాట్ మేకింగ్ అద్భుతంగా ఉంది. లవర్ బాయ్ లా కనిపించే రామ్ లో.. యాక్షన్ హీరోను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో లింగుస్వామి హండ్రెడ్ పర్సెంట్ సక్సస్ అయ్యారు. మామూలుగా పోలీస్ నేపథ్యంలో సినిమా అంటే.. అందులో దేశభక్తికి సంబంధించి డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తాయి.

    Also Read: Akash Puri Annoyed Balayya Babu: బాలయ్య బాబుకి చిరాకు రప్పించిన పూరి జగనాథ్ కొడుకు ఆకాష్

    కానీ, లింగుస్వామి మాత్రం అవేవీ లేకుండానే ‘ది వారియర్’ ట్రైలర్ ను కట్ చేశాడు. పైగా యాక్షన్ సినిమాలో ఎమోషన్స్ ను హైలైట్ చేశాడు. మొత్తానికి ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించేలా ‘ది వారియర్’ ట్రైలర్ ను తీసుకురాబోతున్నారు. ఓ రకంగా రామ్ పై భారీ యాక్షన్ డ్రామాను రన్ చేయడం ఆషామాషీ విషయం కాదు.

    Ram Pothineni

    కానీ స్క్రీన్ ప్లే విషయంలో లింగుస్వామి ఎక్స్ పర్ట్. అందుకే.. ఈ సినిమా పై అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘ది వారియర్’ సినిమాను ఒక సామాజిక మెసేజ్ ను హైలైట్ చేస్తూ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయట.

    అన్నిటికి మించి తన కెరీర్‌ లోనే మొదటిసారిగా రామ్ పక్కా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే.. ఈ సినిమా విషయంలో రామ్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నాడు.

    Also Read:Sammathame Collections: కలెక్షన్స్ లో 5వ రోజు కూడా ‘సమ్మతమే’

    Tags