https://oktelugu.com/

బాబు మార్క్ రాజకీయాలు షూరూ?

  ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయంలో లోపాలను ఎత్తిచూపాల్సిన టీడీపీ నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్నతీరు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు ఏపీ రాజధాని విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు చేస్తుంటే ఆయన కన్ఫూజ్ అవుతున్నారా? లేక ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారో తెలియడం లేదని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2020 / 05:16 PM IST
    Follow us on

     

    ఏపీలో మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేసిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయంలో లోపాలను ఎత్తిచూపాల్సిన టీడీపీ నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్నతీరు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు ఏపీ రాజధాని విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు చేస్తుంటే ఆయన కన్ఫూజ్ అవుతున్నారా? లేక ప్రజలను కన్ఫూజ్ చేస్తున్నారో తెలియడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

    ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో జగన్ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో లైన్ క్లియర్ అయింది. విశాఖపట్టణం పరిపాలన, అమరావతి శాసన, కర్నూలు న్యాయ రాజధానులుగా మారనున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. అమరావతి రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. టీడీపీకి చెందిన నేతలందరూ రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారనే టాక్ విన్పిస్తుంది.

    తాజాగా టీడీపీ నేతలు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం వల్ల రాయలసీమకు కొత్తగా ఒరిగేదేమీ లేదని అంటూనే.. కర్నూలును ఏపీ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో డిమాండ్ తెరపైకి తీసుకొస్తుండంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. గతకొంతకాలంగా టీడీపీ ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా టీడీపీ నేతలు రూట్ మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    దమ్ముంటే టీడీపీ నేతలు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ తరుణంలో వాటి నుంచి తప్పించుకునేందుకు టీడీపీ కర్నూలు రాజధానిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో అనంతపురం జిల్లాకు రావాల్సిన ఎయిమ్స్ ను అమరావతికి తరలించినప్పుడు మాట్లాడని స్థానిక టీడీపీ నేతలు నేడు కర్నూలును పరిపాలన రాజధాని చేయాలని కోరడం ఏంటని వైసీపీ నేతలు అంటున్నారు.

    Also Read: జగన్ కి మేలుచేసేలా బాబు విమర్శలు!

    ఓవైపు చంద్రబాబు అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తుంటే ఆ పార్టీ నేతలు కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతుండటం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. దీంతో టీడీపీ కూడా అమరావతి రాజధానిని అటకెక్కించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై చంద్రబాబు ప్రజలకు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే..!