Kodali Nani vs TDP: అడ్డంగా దొరికిపోవడంతో మంత్రి కొడాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ తప్పు చేయకుంటే నిజనిర్ధారణ కమిటిని ఎందుకు అడ్డుకున్నారని మంత్రి కొడాలి నానిని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నానిని చెందిన కె కన్వెన్షన్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్దారణ కమిటీ కె కన్వెన్షన్‌ను పరిశీలించేందుకు వెళ్లింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తాను క్యాసినో నిర్వహించానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని సవాల్ విసిరారు. ఇందుకు కౌంటర్ ఇస్తూ తాజాగా బొండా ఉమ స్పందించారు. క్యాసినోలో డ్యాన్స్ లు వేసిన వారి పేర్లు తన వద్ద ఉన్నాయన్నారు. శశిభూషన్, విక్టర్ వంటి వాళ్లు డ్యాన్స్ చేశారని ఆరోపించారు.
Also Read: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?
కొవిడ్ వచ్చిందని హైదరాబాద్‌లో ఉంటే చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు. క్యాసినో ఏర్పాటు చేయలేదని నిరూపిస్తే తాను పెట్రోల్ పోసుకుని సిద్ధమని సవాల్ విసిరాడు. నిజమేనైతే మంత్రి కొడాలి నాని కేవలం రాజీనామా చేస్తే చాలన్నారు. ఇందుకు మీడియా సమక్షంలో తాను రెడీ అని చెప్పుకొచ్చారు. అర్ధనగ్న డ్యాన్సులు చేసే వారిని తానే ఆపించానని మంత్రి కొడాలి నాని ఒప్పుకున్నారని చెప్పారు బొండా ఉమ. అనంతరం కె కన్వెన్షన్ లో జరిగిన క్యాసినో వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు.
ఇద్దరం పెట్రోల్ డబ్బలు తెచ్చుకుందామాని, ఇక తేల్చుకుందామని మంత్రి కొడాలి నానికి బొండా ఉమ సవాల్ విసిరారు. మరి ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ బాగానే ట్రై చేస్తుంది. ఈ వ్యవహారంతో గుడివాడలో మంత్రి కొడాలి నాని దూకుడుకు బ్రేక్ వేయాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. మొత్తంగా చూస్తే కొడాలి నాని ఇరుక్కు పోయినట్టే కనిపిస్తోంది. మొన్న పేకాట స్థవరాలు అంటూ సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అది మరువక ముందే కొడాలి నానిపై మరోసారి ఇలాంటి ఆరోపణలు, అది కూడా వీడియోలతో సహా సాక్ష్యాలుగా బయటకు రావడంతో ఆయన ఇరుక్కు పోయినట్టే అనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం నుంచి మంత్రి కొడాలి నాని బయటపడతారా లేదా చూడాలి మరి.
Also Read: తగ్గేదేలే… క్యాసినో పాలిటిక్స్ తో హీటెక్కిన గుడివాడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ