https://oktelugu.com/

బెజవాడలో టీడీపీ కమ్మవర్గం హవా..

ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకు విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖ, విజయవాడ వంటి కీలకనగరాల్లో కొన్నిచోట్ల టీడీపీ పుంజుకోవడం కనిపించింది. మరికొన్నిచోట్ల అందునా.. పట్టుబాగుందని భావించిన చోట మాత్రం పార్టీ ఓడిపోవడం లాంటి సంఘటనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. విజయవాడ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే.. ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో ఓట్ల షేరింగ్ ను గమనిస్తే… ఆసక్తిగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ […]

Written By: , Updated On : April 12, 2021 / 12:23 PM IST
Follow us on

TDP
ఏపీలో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకు విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖ, విజయవాడ వంటి కీలకనగరాల్లో కొన్నిచోట్ల టీడీపీ పుంజుకోవడం కనిపించింది. మరికొన్నిచోట్ల అందునా.. పట్టుబాగుందని భావించిన చోట మాత్రం పార్టీ ఓడిపోవడం లాంటి సంఘటనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. విజయవాడ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే.. ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో ఓట్ల షేరింగ్ ను గమనిస్తే… ఆసక్తిగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గత ఎన్నికల్లో విజయం దక్కించుకుంది.

పైగా ఈ నియోజకవర్గంలో చంద్రబాబుకు అభిమానగణం ఎక్కువ. కమ్మసామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడినుంచి గెలిచిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా కమ్మ వర్గానికి చెందిన నాయకుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ 18వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల షేరింగ్ ను గమనిస్తే.. తూర్పులోని ఏడు డివిజన్లలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేసింది. పైగా ఓటుబ్యాంకు కూడా ఎక్కువగా పడింది. దీనికి కారణం ఏంటంటే..? స్వతహాగా ఇక్కడే ఉన్న అంటే.. ఒక్కడే పుట్టి పెరిగిన కమ్మ సామాజికవర్గం వైసీపీవైపు మొగ్గు చూపింది.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నవారు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారన్న విషయం వెల్లడైంది. వీరంతా కోస్తాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కమ్మ సామాజిక వర్గ ఓటర్లుగా భావిస్తున్నారు. వైసీపీపై వ్యతిరేకత వీరిలో కొట్టొచ్చినట్లు కనిపించిందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో వీరి వ్యాపారాలు బాగా దెబ్బతీశాయి. రియల్ రంగం కుదేలైంది. దీంతో వీరు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలనే పట్టుదలతో వ్యవహరించింది.

వారు ఎక్కడా అధికార పార్టీకి లొంగకుండా పార్టీ గెలుపుకోసం సైలెంట్ గా పనిచేశారని అంటున్నారు. ఇక ఇక్కడే పుట్టి పెరిగిన కమ్మవర్గం మాత్రం… వైసీపీ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. దీంతో పలు డివిజన్లలో వైసీపీ విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక టీడీపీ గెలిచిన కార్పొరేటర్లలో అధికశాతం కమ్మవారు ఉండడం విశేషం.