https://oktelugu.com/

ఆ సినిమాకి అతి పెద్ద సమస్య.. ఏం చేస్తారో ?

కరోనా సెకెండ్ వేవ్ తో మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించడానికి మెల్లగా తన కోరలను తెరుస్తూ.. రోజురోజుకూ జనంలో భయాన్ని కలిగిస్తూ శరవేగంగా దూసుకువస్తోంది. ఇలాంటి పరిస్తుతుల్లో సినిమా థియేటర్లను మూసి వేయడమే మంచింది అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతొంది. అందుకే సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఇప్పుడు మారిపోతున్నాయి. నిర్మాతలు వరుసగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తన రిలీజ్ ను వాయిదా […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 12, 2021 / 12:11 PM IST
    Follow us on


    కరోనా సెకెండ్ వేవ్ తో మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించడానికి మెల్లగా తన కోరలను తెరుస్తూ.. రోజురోజుకూ జనంలో భయాన్ని కలిగిస్తూ శరవేగంగా దూసుకువస్తోంది. ఇలాంటి పరిస్తుతుల్లో సినిమా థియేటర్లను మూసి వేయడమే మంచింది అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతొంది. అందుకే సినిమాల రిలీజ్ డేట్స్ కూడా ఇప్పుడు మారిపోతున్నాయి. నిర్మాతలు వరుసగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తన రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

    కాగా లవ్ స్టోరీ లాగే ఇతర సినిమాలు కూడా ప్రస్తుతం డేట్స్ మార్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు రానా నటించిన ‘విరాటపర్వం’ మీదే ఉంది. మరో రెండు వారాల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా. మరి దీని విడుదల పరిస్థితి ఏంటి? ముందుగా ప్రకటించినట్టే.. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందా ? అసలు అప్పటికి పరిస్థితులు మెరుగవుతాయా ? మెరుగైతే రిలీజ్ డేట్ మార్చుకోవాలిసిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితులు చూస్తే.. థియేటర్లను క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.

    మరి ఈ నేపథ్యలో విరాటపర్వం సినిమాని కూడా వాయిదా వేయడమే బెటర్. కానీ టీం మాత్రం ప్రస్తుతానికి ప్రమోషన్లను బంద్ చేసింది. కానీ సినిమా విడుదలను వాయిదా వేస్తోన్నట్లు ప్రకటించే దైర్యం మాత్రం చేయలేకపోయింది. కాకపోతే వాయిదా వెయ్యక తప్పదు. కరోనా సెకెండ్ వేవ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ల వైపు చూపు వెయ్యడం లేదిప్పుడు. నిజానికి విరాట పర్వం ప్రధాన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే. కాబట్టి.. ఫ్యామిలీలు థియేటర్లకు రాకపోతే.. ఈ సినిమాకి అది అతి పెద్ద సమస్య అవుతుంది. మరి విరాటపర్వం విషయంలో నిర్మాతలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. అన్నట్టు ఈ సినిమా కూడా సాయి పల్లవి చుట్టూనే తిరుగుతుంది.