
Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఇప్పుడు ఎటో అనేది తెలియడం లేదు. ఇటు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. అటు బీజేపీతోనూ మైత్రి కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ దారెటు? అనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు ప్రస్తుతం ఎటు తేల్చుకోలేకపోతున్నారు. శకునం చెప్పే బల్లి కుడిదిలో పడినట్లు ఆయన భవిష్యత్ ఆయనకే తెలియడం లేదు. ఫలితంగా ఆయన వైఖరి ఏమిటనేది అందరిలో వస్తున్న ప్రశ్న.
రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీతోనూ సఖ్యతగా మెలగాలని భావిస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లోనూ భిన్న వైఖరులే కనిపిస్తున్నాయి. బీజేపీలో సైతం టీడీపీతో పొత్తు ఉంటుందని ఒక వర్గం లేదని మరో వర్గం తగవులాడుకుంటున్నాయి. దీంతో ఏపీలో విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
టీడీపీ(Telugu Desam Party)తో పొత్తు విషయంలో జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు లాంటి నేతలు పొత్తు లేదని చెబుతున్నారు. వీరికి భిన్నంగా మరో నేత సీఎం రమేష్ స్పందిస్తున్నారు. దీంతో రాజకీయ పరిస్థితులు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని చెబుతున్నారు. దీంతో బీజేపీ, టీడీపీ నేతల పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
బీజేపీకి రాష్ర్టంలో ఓటు బ్యాంకు లేదనే సాకుతో దానితో పొత్తు వద్దనే విషయం కొందరు టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా రావచ్చని చెబుతున్నారు. దీంతో టీడీపీ దేనితో జత కడుతుందో తెలియడం లేదు. మొత్తానికి ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ అడుగు ఎటు పడుతుందో అనే సంశయం అందరిలో నెలకొంది.