https://oktelugu.com/

చంద్రబాబుకు ఈసారి కష్టాలు తప్పవట?

ఇప్పటికే తెలంగాణలో నామరూపాల్లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ.. అటు ఏపీలోనూ రోజురోజుకూ అంధకారంలోకి నెట్టివేయబడుతోంది. గత ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజ‌యవాడ, గుంటూరు, శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీలు వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. మిగిలిన 22 సీట్లలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల్లో నిర్వేదం, నిస్తేజం అలుముకోవ‌డంతో వారంతా చెల్లాచెదురు అయిపోయారు. ఒక‌రిద్దరు చ‌నిపోతే.. మ‌రికొంద‌రు పార్టీ మ‌రిపోయారు. Also Read: వదిలేసిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 25, 2021 10:47 am
    Follow us on

    TDP
    ఇప్పటికే తెలంగాణలో నామరూపాల్లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ.. అటు ఏపీలోనూ రోజురోజుకూ అంధకారంలోకి నెట్టివేయబడుతోంది. గత ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజ‌యవాడ, గుంటూరు, శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీలు వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. మిగిలిన 22 సీట్లలో టీడీపీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల్లో నిర్వేదం, నిస్తేజం అలుముకోవ‌డంతో వారంతా చెల్లాచెదురు అయిపోయారు. ఒక‌రిద్దరు చ‌నిపోతే.. మ‌రికొంద‌రు పార్టీ మ‌రిపోయారు.

    Also Read: వదిలేసిన జగన్.. షర్మిల పని అయిపోయినట్టేనా?

    అందుకే.. ఇప్పుడు టీడీపీకి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు దొరకడం లేదంట. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల కోసం వేట కొనసాగించాల్సిన దుస్థితి వచ్చిందట. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం తరుపున పోటీ చేసిన వారిలో డీకే స‌త్యప్రభ (రాజంపేట‌), శివ‌ప్రసాద్ ( చిత్తూరు) మృతిచెందారు. అనకాప‌ల్లిలో పోటీ చేసిన అడారి ఆనంద్‌కుమార్‌, నెల్లూరులో పోటీ చేసిన బీద మ‌స్తార్‌రావు, ఒంగోలులో పోటీ చేసిన మాజీ మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు. క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ రెడ్డి కాషాయం కండువా క‌ప్పుకున్నారు. న‌ర‌సారావుపేటలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, అర‌కులో వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్ రాజ‌కీయాల‌కు స్వస్తి చెప్పిన‌ట్టే.. వీరిద్దరూ వ‌యో భారంతోనే ఉన్నారు. రాజ‌మండ్రిలో పోటీ చేసిన మాగంటి రూపాదేవి ఇక రాజ‌కీయాల‌కు బైబై చెప్పేసిన‌ట్టే అని ఆమె మామ ముర‌ళీమోహ‌న్ స్వయంగా వెల్లడించారు.

    Also Read: కుప్పంలో కుప్పకూలడానికి ఆ త్రిమూర్తులే కారణమట..? : ఫైర్‌‌ అయిన తమ్ముళ్లు

    ఏలూరులో సీనియ‌ర్ నేత మాగంటి బాబు కూడా రాజ‌కీయాల నుంచి నిష్క్రమించిన‌ట్టే..! అమ‌లాపురంలో ఓడిన దివంగ‌త మాజీ స్పీక‌ర్ బాల‌యోగి వార‌సుడు హ‌రీష్ మాథూర్ పార్టీ ఆఫీస్‌లో బిజీబిజీ అయ్యారు. న‌ర‌సాపురంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ త‌న‌ను చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ పోటీ చేసి రాజ‌కీయ భ‌విష్యత్తు బ‌ద్నాం చేశార‌ని తెలుగుదేశం కార్యక‌లాపాలు వ‌దిలేశారు. మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ సైతం రాజ‌కీయాల నుంచి నిష్క్రమించి త‌న వార‌సుడిని రంగంలోకి దింపుతాన‌ని ఇప్పటికే బాబుకు చెప్పేశారు. మరోవైపు.. బాప‌ట్లలో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిన శ్రీరాం మాల్యాద్రి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్న ధోర‌ణితో ఉన్నారు. ఆయ‌న రాజ‌కీయ గురువు సుజ‌నా చౌద‌రి ఏది చెప్తే ఆయనకు అదే వేదం. తిరుప‌తిలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక లక్ష్మి మాత్రం మ‌ళ్లీ ఉప ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నారు. నంద్యాల‌లో ఓడిన మాండ్ర శివానంద‌రెడ్డి వైసీపీలోకి దూకాలా ? వ‌ద్దా ? అని అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నారు. క‌ర్నూలులో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం ఇప్పటి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్నా లోక‌ల్ వార్‌లో స‌త్తా చాటి ప‌ట్టు నిలుపుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇక అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఇద్దరు నేత‌లు మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. అనంత‌పురం పార్లమెంట‌రీ ఇన్‌చార్జి జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి, ఇటు హిందూపురంలో ఓడిన నిమ్మల కిష్టప్ప ఉన్నంత‌లో బెట‌ర్‌. వీరిలో ప‌వ‌న్ కుమార్ రెడ్డి దూకుడు రాజ‌కీయాల‌తో వార్తల్లో ఉంటున్నారు. ఇక ఈ లెక్కలన్నింటినీ చూస్తుంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దొరికినా అంత గెలుపు గుర్రాలను అధినేత చంద్రబాబు ఎక్కడ నుంచి తీసుకొస్తారో చూడాలి.