మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగబాబు.. ఆ తర్వాత నిర్మాతగా మారి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో జడ్జిగా చేరి, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దాదాపు ఏడేళ్లు ఈ షోలో జడ్జిగా ఉన్న మెగా బ్రదర్.. ఆ తర్వాత మరో ఛానల్ లో ‘అదిరింది’అనే షోకు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే.
‘నా ఛానల్.. నా ఇష్టం’ అంటూ.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు నాగబాబు. అయితే.. జబర్ధస్త్ షోలో ఉన్నప్పుడే చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రోత్సహించారు. ఇప్పుడు ఏకంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ షో ప్రారంభించి, కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నారు.
Also Read: ‘సర్కారు వారి పాట’ క్రేజీ అప్డేట్.. థియేటర్లో ఫ్యాన్స్ గోల గోలేనట!
తన యూట్యూబ్ ఛానల్ లో ‘ఖుషీ ఖుషీగా’ అనే ఓ స్టాండప్ కామెడీ షోను మొదలు పెట్టారు నాగబాబు. దాదాపు ముప్పై మందికి ఆడిషన్స్ నిర్వహించి, కొందరిని సెలెక్ట్ చేసి, ప్రీ ప్లాన్డ్ గా ఈ షోను ప్రారంభించారు. ఈ షో ఇప్పటి వరకూ పది ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
అయితే.. వ్యూయర్స్ ఈ షోపై కంప్లైంట్ చేస్తున్నారు. ‘ఖుషీ ఖుషీగా’ షోలో బూతులు ఎక్కువగా ఉంటున్నాయని, చాలా మంది కంటెస్టెంట్లు వల్గర్‌గా మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ నాగబాబు ఓ వీడియోను రిలీజ్ చేశారు. కామెడీ కోసం చెప్పే మాటలు బూతులుగా అనిపిస్తే తామేం చేయలేమని, తమ షో నచ్చని వాళ్లు అస్సలే చూడొద్దని అన్నారు.
Also Read: ఇప్పటికీ రిలీజ్ కాని.. జూ.ఎన్టీఆర్ మొదటి సినిమా తెలుసా?
కాగా.. లేటెస్ట్ గా ‘ఖుషీ ఖుషీగా’ కార్యక్రమానికి సంబంధించిన 11వ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఓ కంటెస్టెంట్ ‘నేను ఈరోజు చెప్పే టాపిక్ వివాదాస్పద.. ఆసక్తికరమైనది’ అంటూ షో స్టార్ట్ చేశాడు. దీనికి నాగబాబు ఇలా రియాక్ట్ అయ్యాడు… ‘ఎవడు చెప్పాడయ్యా అది కాంట్రవర్సీ అని..? బాగా అవసరమైన, ఆసక్తికరమైన టాపిక్’ అని అన్నారు. దీంతో అందరూ నవ్వేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
దానికి కంటిన్యూగా ఫస్ట్ నైట్ గురించి కూడా మాట్లాడారు. ‘ఇప్పటి రోజుల్లో ఫస్ట్ నైట్స్ అన్నీ హోటళ్లలో జరుగుతున్నాయి. కానీ.. పాత రోజుల్లో శోభనం గదిలో ఏం జరిగిందా? అని చూడ్డానికి ఓ భూతద్దం పట్టుకుని వచ్చేసేవాళ్లు’ అని అన్నారు నాగబాబు. ఇవాళ్టి పిల్లలకు అవసరానికి మించి తెలిసిపోతున్నాయని, అలా అవసరానికి మించి తెలవడమే దరిద్రం అని అన్నారు నాగబాబు.