Current Charges: కరెంట్ చార్జీలపై టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత

Current Charges: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు వడ్డించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు ఉండవని చెప్పిన సీఎం జగన్ ప్రస్తుతం విద్యుత్ చార్జీలు విధించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రూ ఆప్ అనే సెక్షన్ కింద యూనిట్ కు రూ.1.23 పైసలు వడ్డించేందుకు కసరత్తు చేస్తోంది. వంద యూనిట్లు వాడితే రూ.123 అదనంగా వస్తుంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ చార్జీల భారం మోయలేమని నినదిస్తున్నారు. ట్రూ ఆప్ చార్జీల […]

Written By: Sekhar Katiki, Updated On : September 9, 2021 1:24 pm
Follow us on

Current Charges: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు వడ్డించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు ఉండవని చెప్పిన సీఎం జగన్ ప్రస్తుతం విద్యుత్ చార్జీలు విధించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రూ ఆప్ అనే సెక్షన్ కింద యూనిట్ కు రూ.1.23 పైసలు వడ్డించేందుకు కసరత్తు చేస్తోంది. వంద యూనిట్లు వాడితే రూ.123 అదనంగా వస్తుంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ చార్జీల భారం మోయలేమని నినదిస్తున్నారు.

ట్రూ ఆప్ చార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిది. ఇందులో భాగంగా ప్రజల నుంచి రాబట్టేందుకే ప్రణాళిక రచిస్తోంది. ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశంతోనే గత టీడీపీ ప్రభుత్వం ఈ భారం మోపేందుకు సాహసం చేయలేదు. దీంతో విద్యుత్ సంస్థలపై కూడా ఏ రకమైన వడ్డింపులు విధించలేదు. దీంతో ప్రజలకు కూడా ఏ విధమైన భారాలు మీద పడలేదు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం కూడా చార్జీలు విధించకుండా ఉంటే బాగుండనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇదే అవకాశంగా తీసుకుంటున్నప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చార్జీల వసూలుకే ప్రాధాన్యం ఇస్తోంది. నింద గత ప్రభుత్వంపైనే నెడుతోంది. వారు చేసిన విధానాలతోనే ప్రస్తుతం చార్జీలు విధించాల్సి వస్తోందని చెబుతోంది. అప్పటి ప్రభుత్వం ట్రూ ఆప్ సర్దుబాటు కోసం నిధులేవి కేటాయించలేదని బుకాయిస్తోంది. అందుకే ప్రజల దగ్గర వసూలు చ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తరువాత మాట మరిచిపోయిందని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అధికారం వచ్చేదాకా ఒక మాట వచ్చాక మరో మాట అని పెదవి విరుస్తున్నారు. ప్రజల పై విధించే భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఇదో నాటకంగా చెబుతున్నారు. ప్రజలను పిండుకునే పద్దతికి శ్రీకారం చుడుతున్నారని వాపోతున్నారు.