AP Cabinet: ఏపీ కేబినెట్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి..?: ఎందుకంటే..?

AP Cabinet: ఏపీలో కేబినెట్ విస్తరణ కోసం నాయకులు ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో ఎవరికి పదవి ఉంటుందో.. ఎవరిది ఊడుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అయితే మొత్తంగా సీఎం జగన్ కు అనుకూలంగా ఉన్నవారికి మాత్రం ఢోకా లేదనే భావన చాలా మందిలో ఉంది. అందువల్ల మంత్రులుగా ఉన్నవారు జగన్ మాటే వేదం అంటూ నడుచుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అలా నడుచుకున్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులను దొరకబట్టి వారిని మారుస్తారనే ప్రచారం […]

Written By: NARESH, Updated On : September 9, 2021 1:35 pm
Follow us on

AP Cabinet: ఏపీలో కేబినెట్ విస్తరణ కోసం నాయకులు ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో ఎవరికి పదవి ఉంటుందో.. ఎవరిది ఊడుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అయితే మొత్తంగా సీఎం జగన్ కు అనుకూలంగా ఉన్నవారికి మాత్రం ఢోకా లేదనే భావన చాలా మందిలో ఉంది. అందువల్ల మంత్రులుగా ఉన్నవారు జగన్ మాటే వేదం అంటూ నడుచుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అలా నడుచుకున్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులను దొరకబట్టి వారిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కేబినెట్ విస్తరణపై ఓ న్యూస్ హాట్ హాట్ గా సాగుతోంది. కేబినెట్లో ఉన్నవారు తొలగిపోవడం విషయం పక్కనబెడితే కొత్తవారు మాత్రం జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.

ముఖ్యంగా జగన్ కు ఆత్మగా పిలవబడే సజ్జల రామకృష్ణరెడ్డిని కేబినేట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. అయితే సలహాదారులుగా 60 మంది ఉన్నారు. కానీ మిగతా వారికంటే సజ్జలది ప్రత్యేకం. జగన్ మాట తరువాత సజ్జల మాటకే విలువ ఎక్కువ అని చెవులుకొరుక్కుంటున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనూ… అంతర్గత కలహాలను తీర్చడంలో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ట్రబుల్ షూటర్ అన్న పేరు ఉంది. దీంతో ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలాగో.. జగన్ కు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే.. అని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో సజ్జలకు చిన్న చిన్న పదవులు కాకుండా ఏకంగా కేబినెట్లోకి తీసుకుంటే ఆయన రుణం తీర్చుకున్నట్లవుతుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. కొందరు మంత్రులపై అజమాయిషీ చేస్తున్నట్లు టాక్ .అయితే ఏ అధికారంతో ఇలా చేస్తున్నారని కొందరు లోలోపల అనుకుంటున్నారు. దీంతో ఇక తనకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం ఇస్తే అయన అధికారికంగా ఏం చేసినా విమర్శలు రావనే ఉద్దేశ్యంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అనుకుంటున్నారు.

2019 ఎన్నికల వరకు సజ్జల కేవలం పార్టీ వ్యక్తి మాత్రమే. కానీ జగన్ కు సలహాలు ఇవ్వడంలో మిగతా వారి కంటే ఎక్కవ అని చెప్పుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు జగన్ కు అన్నీ తానై సజ్జల ముందుండి నడిపిస్తున్నారు. దీంతో ఇంత చేసిన ఆయనకు సలహాదారుడు అనే చిన్న పదవి కాకుండా మంత్రి హోదా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కేబినెట్ విస్తరణ గురించి గత రెండు నెలలుగా తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే రెండేళ్ల తరువాత కేబినెట్ విస్తరించి అందరికీ న్యాయం చేస్తానని జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. దీంతో కొందరు ఇప్పటి వరకు మంత్రులుగా కాని వారు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తమ పదవి ఎక్కడబోతుందోనని మంత్రి హోదాలో ఉన్నవారు భయపడుతున్నారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వెంటనే కరోనా విజృంభించింది. ఆ తరువాత రెండేళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. దీంతో తామ మంత్రి హోదాలో ఎక్కువకాలం గడపలేదని ఆవేదన చెందుతున్నారు.

అయితే మరికొంత కాలం ఇదే మంత్రి వర్గం ఉంటుందని జగన్ చెప్పినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా జగన్ సీక్రెట్ సర్వే చేయించి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బాగా ప్రచారం అవుతుంది. అయితే కొంత కాలం తరువాత ఏ పేరు వినిపిస్తుందో చూడాలి.