https://oktelugu.com/

Jagan Kadapa : జ‌గ‌న్ కోటపై గురి.. టీడీపీలోకి ఆ నేత‌లు?

Jagan Kadapa : క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. కాంగ్రెస్ నుంచి వైసీపీ వ‌ర‌కు ఆ కుటుంబానికి పెట్ట‌ని కోట‌. ఎన్నిక ఏదైనా ఫ‌లితం మాత్రం వైసీపీ వైపే. రాష్ట్ర‌మంతా ఒక‌వైపు నిలిచినా.. క‌డ‌ప మాత్రం వైఎస్ వెంటే. ద‌శాబ్ధాలుగా ఇదే ఆన‌వాయితీ. కానీ 2024లో వైసీపీ కంచుకోట‌ను బ‌ద్దలుకొడ‌తామ‌ని టీడీపీ చెబుతోంది. జ‌న‌సేన‌తో పొత్తుతో అది సులువుగా మారుతుంద‌ని భావిస్తోంది. క‌డ‌ప జిల్లాలో టీడీపీ బ‌లం నామ‌మాత్ర‌మే. మొద‌టి నుంచి క‌డ‌ప జ‌నం వైఎస్ […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : January 22, 2023 3:35 pm
    Follow us on

    Jagan Kadapa : క‌డ‌ప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట‌. కాంగ్రెస్ నుంచి వైసీపీ వ‌ర‌కు ఆ కుటుంబానికి పెట్ట‌ని కోట‌. ఎన్నిక ఏదైనా ఫ‌లితం మాత్రం వైసీపీ వైపే. రాష్ట్ర‌మంతా ఒక‌వైపు నిలిచినా.. క‌డ‌ప మాత్రం వైఎస్ వెంటే. ద‌శాబ్ధాలుగా ఇదే ఆన‌వాయితీ. కానీ 2024లో వైసీపీ కంచుకోట‌ను బ‌ద్దలుకొడ‌తామ‌ని టీడీపీ చెబుతోంది. జ‌న‌సేన‌తో పొత్తుతో అది సులువుగా మారుతుంద‌ని భావిస్తోంది.

    క‌డ‌ప జిల్లాలో టీడీపీ బ‌లం నామ‌మాత్ర‌మే. మొద‌టి నుంచి క‌డ‌ప జ‌నం వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ఓటు వేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి అండ‌గా నిలుస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలోని 10 సీట్ల‌లో ఒక్క రాజంపేట మాత్ర‌మే టీడీపీ గెలిచింది. గ్రామ‌స్థాయి నుంచి టీడీపీ కేడ‌ర్ బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బ‌ల‌మైన నాయ‌క‌త్వ కొర‌త టీడీపీని వేధిస్తోంది. నాయ‌క‌త్వం ఉన్నా వైఎస్ కుటుంబాన్ని గట్టిగా ఎదిరించి ముందుకు పోయేవారు అరుదు. దీంతో వైఎస్ కుటుంబానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. 2019 ఎన్నిక‌ల్లో 10 సీట్లను వైసీపీనే గెలిచింది.

    క‌డ‌ప జిల్లాలో సీనియ‌ర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ నుంచి గ‌ట్టి హామీ ల‌భించ‌డంతో పార్టీలోకి చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ ర‌వీంద్రా రెడ్డి టీడీపీలో చేరిక ఖాయ‌మైంది. గ‌తంలో మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డీఎల్ ర‌వీంద్రారెడ్డి. మైదుకూరు అసెంబ్లీ లేదా క‌డ‌ప పార్ల‌మెంట్ నుంచి డీఎల్ తో పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో మైదుకూరు నుంచి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పోటీ చేశారు. స్వ‌ల్ప మెజార్టీ తేడాతో ఓడిపోయారు. టీడీపీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌తో మైదుకూరు స్థానం వైసీపీ ఖాతాలో పడింది. మ‌ళ్లీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కే సీటు ఇచ్చే అవ‌కాశం ఉంది. డీఎల్ ర‌వీంద్రా రెడ్డి క‌డ‌ప ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంది.

    క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ మేన‌మామ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. టీడీపీ ఇంచార్జీగా పుత్తా న‌ర‌సింహారెడ్డి ఉన్నారు. గ‌తంలో టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లిన వీర‌శివారెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వాకూడ‌ద‌ని టీడీపీ నిర్ణ‌యించిన నేప‌థ్యంలో పుత్తా న‌ర‌సింహారెడ్డికి టికెట్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. పుత్తా స్థానంలో వీర‌శివారెడ్డిని పోటీలో నిలిపే అవ‌కాశం ఉంటుంది. కానీ పుత్తా న‌ర‌సింహారెడ్డి, వీర‌శివారెడ్డి ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేయ‌డ‌మే టీడీపీ ముందున్న స‌వాల్. ఇద్ద‌రు నేత‌లు క‌లిసి ప‌నిచేస్తే టీడీపీ గెలుపు సునాయాసం అవుతుంది. క‌డ‌ప జిల్లాలో కీల‌కంగా ఉన్న నేత‌ల్ని పార్టీలో చేర్చుకుని క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌ని టీడీపీ భావిస్తోంది. దీనికి జ‌న‌సేన పొత్తు క‌లిసి రానుంది. జ‌న‌సేన‌కు క‌డ‌ప జిల్లాలో గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు ఉంది. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే వైఎస్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం సులువే.