Vijay Devarakonda Remuneration : ఇటీవల కాలంలో వచ్చిన కుర్ర హీరోలలో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ..యూత్ లో ఇతగాడికి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఈ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించడం అంటే మాటలు కాదు.. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలకు కళ్ళు చెందిరే ఓపెనింగ్స్ వస్తాయి.. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ చిత్రం దారుణమైన పరాజయం పాలైంది.

ఈ సినిమాతో విజయ్ పని అవుట్ అని అందరూ అనుకున్నారు.. కానీ మార్కెట్ లో అతనికి ఉన్న డిమాండ్ చెక్కు చెదరలేదు.. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఖుషి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయిలు చేసింది.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని చూసి విజయ్ దేవరకొండ కి 45 కోట్ల రూపాయిల పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఏ మాత్రం వెనకాడట్లేదు.. ఇటీవలే ఆయన జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు.. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను విజయ్ దేవరకొండ కి 45 కోట్ల రూపాయిలు ఇస్తున్నారట.. ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.. ఇండస్ట్రీ కి వచ్చిన ఆరెళ్లలోనే ఈ స్థాయికి ఎదిగిన ఏకైక యువ హీరోగా విజయ్ దేవరకొండ సరికొత్త చరిత్ర సృష్టించాడని అంటున్నారు ట్రేడ్ పండితులు.