https://oktelugu.com/

Casino war: కొడాలి నాని ‘క్యాసినో’ పై టీడీపీ తగ్గేదేలే.. గుడివాడలో ఉద్రిక్తత

Casino war: ఏపీలో కొత్తగా క్యాసినో పంచాయితీ నెలకొంది. మొన్నటివరకు పీఆర్సీ మీద ఉద్యోగులు ఆందోళన దిగగా.. జగన్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యి ఆ విషయం తేల్చారు. తీరా చూస్తే జగన్ ప్రకటించిన ఫిట్మెంతో తమకు ఒరిగేది ఏమీ లేదని, పీఆర్సీ ప్రకటిస్తే వేతనాలు పెరగాలి కానీ, ఉన్న జీతం తగ్గుతోందని ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. సమ్మకు సైతం సై అంటున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 21, 2022 / 04:57 PM IST
    Follow us on

    Casino war: ఏపీలో కొత్తగా క్యాసినో పంచాయితీ నెలకొంది. మొన్నటివరకు పీఆర్సీ మీద ఉద్యోగులు ఆందోళన దిగగా.. జగన్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యి ఆ విషయం తేల్చారు. తీరా చూస్తే జగన్ ప్రకటించిన ఫిట్మెంతో తమకు ఒరిగేది ఏమీ లేదని, పీఆర్సీ ప్రకటిస్తే వేతనాలు పెరగాలి కానీ, ఉన్న జీతం తగ్గుతోందని ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ఉద్యోగులు కూడా మండిపడుతున్నారు. సమ్మకు సైతం సై అంటున్నారు.

    Kodali Nani

    తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని తన కన్వెన్షన్ హాల్లో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీ వేయడంతో ఇందులో సభ్యులుగా ఉన్న నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల రామయ్య, అలపాటి రాజా తదితరులు కృష్ణా జిల్లాలోని గుడివాడకు చేరుకున్నారు. వీరంతా కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్తుండగా.. పోలీసులు మధ్యలోనే అడ్డగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

    Also Read: జగన్ బుజ్జగించినా తగ్గేదేలే.. 7 నుంచి సమ్మెకు ఏపీ ఉద్యోగులు..
    దీంతో టీడీపీ నేతలు బోండా ఉమా, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. మంత్రి దొంగచాటుగా క్యాసినోలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని బోండా ఉమ ఆరోపించారు.

    ఈ నేపథ్యంలోనే బోండా ఉమ కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడ్డారని తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, గుడివాడలో ఏర్పాటైన క్యాసినోలపై రీసెంట్‌గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్శ కూడా మంత్రి కొడాలి నానిని మెచ్చుకుంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

    Also Read: ఏపీ ఎక్స్ ప్రెస్ ఎందుకు అంటుకుంది? మంటలు ఎందుకు వ్యాపించాయి.?

    Tags