శ్రీకాళహస్తిలో టీడీపీకి దిక్కేవరు?

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించిందంటే ఈ ప్రాంతంలో పసుపుదండు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తిలో టీడీపీ పెద్దదిక్కుగా ఉన్నారు. టీడీపీ తరుఫున గోపాల కృష్ణారెడ్డి ఐదుసార్లు ఎమ్మెుల్యేగా గెలుపొందారు. 1994-2004 మధ్యకాలంలో గోపాల కృష్ణారెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఈ నియోజకవర్గానికి తనకు, టీడీపీ […]

Written By: Neelambaram, Updated On : August 1, 2020 12:33 pm
Follow us on


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించిందంటే ఈ ప్రాంతంలో పసుపుదండు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తిలో టీడీపీ పెద్దదిక్కుగా ఉన్నారు. టీడీపీ తరుఫున గోపాల కృష్ణారెడ్డి ఐదుసార్లు ఎమ్మెుల్యేగా గెలుపొందారు. 1994-2004 మధ్యకాలంలో గోపాల కృష్ణారెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఈ నియోజకవర్గానికి తనకు, టీడీపీ కంచుకోటగా మార్చారు. అయితే టీడీపీ కంచుకోట ఆయన తనయుడి కారణంగానే బీటలు వారుతున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

Also Read: బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరిక మేరకు 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి టికెట్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో టీడీపీ శ్రీకాళహస్తిలోనూ ఓటమి చెందింది. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు ఓటమి పాలయ్యాడు. దీంతో నాటి నుంచి బొజ్జల కుటుంబం టీడీపీకి అందుబాటులో ఉండటంలేదనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుకు కూడా బొజ్జల కుటుంబం స్పందించకపోవడంపై క్యాడర్లో అయోమయం నెలకొంటుంది. స్థానిక టీడీపీ నేతలపై అధికార పక్షం నుంచి దాడులు కొనసాగుతున్నా తమకు బొజ్జల కుటుంబం అండగా నిలువడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

కరోనా సమయంలోనూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై కూడా బొజ్జల కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని స్థానిక నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. బొజ్జల కుటుంబం టీడీపీని పూర్తిగా గాలికొదిలేసిందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ క్యాడర్ కు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదంటున్నారు. టీడీపీ నేతల సమస్యలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వలసబాట పట్టారని తమ్ముళ్లు వాపోతున్నారు.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సుధీర్ రెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటడంపై తమ్ముళ్లు విసుగు చెందుతున్నారంట. నియోజకవర్గంలో పార్టీ ఇలానే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమేనని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. దీంతో పలువురు వైసీపీలోకి చేరుతుండగా కొందరు పార్టీపై ఉన్న మమకారంతో పలువురు టీడీపీని వీడలేక సైలంట్ అవుతున్నారు. ఇదే అదునుగా శ్రీకాళహస్తిలో బొజ్జల బ్రాండ్ కనుమరుగయ్యేలా వైసీపీ పావులు కదుపుతోంది. సుధీర్ రెడ్డి వైసీపీ చర్యలకు విరుగుడుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

శ్రీకాళహస్తిలో టీడీపీ బలంగా ఉన్నా క్యాడర్లో జోష్ నింపే నేతలు లేకపోవడంతో టీడీపీకి గడ్డురోజులు వచ్చేలా కన్పిస్తున్నాయి. ఇకనైన చంద్రబాబు శ్రీకాళహస్తిపై దృష్టిసారంచకుంటే ఈ నియోజకవర్గాన్ని మరిచిపోవాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. చంద్రబాబు టీడీపీ నేతల్లో జోష్ నింపే కార్యక్రమాలు ఏమైనా చేస్తారో లేదో వేచి చూడాల్సిందే..!