https://oktelugu.com/

బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష

కొత్తగా నియమితులైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి మొట్టమొదటి పరీక్ష ఎదురుకాబోతోంది. ఈ టఫ్ పరీక్షను బండి ఎలా ఎదుర్కొంటాడు.? ఈ పెద్ద పరీక్షలో బండి పాస్ అవుతాడా? లేదా అనేది తొందరలోనే తేలనుంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు మరియు జీహెచ్ఎంసీకి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వాటి కాలపరిమితి ముగుస్తుండడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2020 / 11:21 AM IST
    Follow us on


    కొత్తగా నియమితులైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి మొట్టమొదటి పరీక్ష ఎదురుకాబోతోంది. ఈ టఫ్ పరీక్షను బండి ఎలా ఎదుర్కొంటాడు.? ఈ పెద్ద పరీక్షలో బండి పాస్ అవుతాడా? లేదా అనేది తొందరలోనే తేలనుంది.

    ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు మరియు జీహెచ్ఎంసీకి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వాటి కాలపరిమితి ముగుస్తుండడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది.

    Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

    ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాడు? ఈ కాలపరీక్షల్లో నెగ్గుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి బీజేపీలో మంచి శక్తివంతమైన క్యాడర్ ఉంది. కానీ నాయకులలో ఆధిపత్యపోరు.. ఐక్యత లేని కారణంగా ఆ పార్టీ ఓడిపోతోంది.

    తాజాగా బండి సంజయ్ వరంగల్ పై దృష్టి కేంద్రీకరించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికీ అక్కడ పుంజుకునే పరిస్థితిల్లో లేదు. కానీ మంచి యువ నాయకులు, యువత అక్కడ ఉండడంతో బండి సంజయ్ వారికి బాధ్యతలు సీట్లు ఇస్తానని.. పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేశారు. దీంతో బీజేపీ పునరుజ్జీవం చెందుతోంది.

    ఇక ఖమ్మం విషయానికొస్తే పార్టీకి పెద్దగా ఆశలు లేవు. జీహెచ్ఎంసీలో మాత్రం భారీగా అభిమానులు, నేతలు, కార్యకర్తల బలం ఉంది. హైదరాబాద్ లో మంచి పోటీని ఇవ్వగల సత్తా బీజేపీకి ఉంది. ఈ క్రమంలోనే దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బండి సంజయ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

    Also Read: బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం…!

    అధికార టీఆర్ఎస్, ఎంఐఎంతో పోటాపోటీ నిలబడాలని.. మూడోస్థానంలో నిలవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ను నాలుగో స్థానానికి తొక్కేయాలని ప్లాన్లు వేస్తున్నారు. వరంగల్ లో మంచి ప్రదర్శనతోపాటు హైదరాబాద్ లోనూ బీజేపీ మెరుగుపడగలదని బండి సంజయ్ అంచనా వేస్తున్నారు.

    ఈ క్రమంలోనే విభేదాలకు.. గొడవలకు దూరంగా ఉండాలని క్యాడర్ కు బండి సంజయ్ హితబోధ చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో బండి కార్యాచరణ మొదలుపెట్టారు.కష్టపడి పనిచేయాలని.. వారికే గుర్తింపు.. పదవులు దక్కుతాయని వివరిస్తున్నారు. వరంగల్ నగరపాలికలో గట్టి పోటీనివ్వాలని క్యాడర్ ను కోరుతున్నారు. వరంగల్ లో మొదలుపెట్టిన బండి ఇప్పుడు హైదరాబాద్ లోనూ అదే మంత్రి జపిస్తున్నారు. మరి ఈ తొలి పరీక్షలో బండి పాస్ అవుతాడా లేదా అన్నది వేచిచూద్దాం.

    -ఎన్నం