RRR: వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) రెబల్‌గా మారి ప్రతీ రోజు ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ‘రచ్చబండ’ పేరిట ప్రతీ రోజు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా ఆ పార్టీ రెండేళ్ల నుంచి అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయన్ను సస్పెండ్ చేసేందుకుగాను సాహసించడం లేదు. కాగా, ఇటీవల తాను రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తానని సవాల్ విసిరారు. కాగా, రఘురామకృష్ణరాజు రాజీనామా నేపథ్యంలో బీజేపీ నుంచి సానుకూలత లభించడం లేదని తెలుస్తోంది.

నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం తమకు ఓకేనని, కానీ, సాధారణ ఎన్నికలకు రెండేళ్ల ముందర రాజీనామా సరికాదని కమలనాథులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కూడా సందిగ్ధంలో పడ్డారని తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఆర్ఆర్ఆర్ రెబల్ ఎంపీగా పార్లమెంటులో కొనసా..గుతున్నారు. వైసీపీ ఆయన అనర్హత వేటు విషయంలో స్పీకర్‌కు కంప్లయింట్ చేసింది. అయితే, ఆ కంప్లయింట్‌ను స్పీకర్ పరిశీలిస్తున్నారు.
వైసీపీని దెబ్బతీయాలని రఘురామకృష్ణరాజు ఆలోచిస్తున్నప్పటికీ తాను రాజీనామా చేస్తే టీడీపీ లాభపడుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం అంచనా వేసిందట. ఎందుకంటే వారికున్న లెక్కల ప్రకారం పార్లమెంటు స్థానంలో వైసీపీ ఓడిపోతే కనుక ఆటోమేటిక్‌గా టీడీపీ పుంజుకునే చాన్సెస్ ఉణ్నాయని అనుకుంటున్నారని టాక్. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు రాజీనామా ఎపిసోడ్‌తో టీడీపీకి లాభం చేకూరొద్దని బీజేపీ భావిస్తుందని వినికిడి.
Also Read: Chandrababu: పొత్తుల ఎత్తులు.. 2024లో చంద్రబాబు ప్లాన్ బి ఇదే
రఘురామకృష్ణరాజు ఎత్తుగడ తెలిసిన నేపథ్యంలోనే బీజేపీ రఘురామకృష్ణరాజును రాజీనామా చేయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. అయితే, మరోవైపు నుంచి రఘురామ కృష్ణరాజుపై రాజీనామా చేయాలని ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రాజుగారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అయితే, రఘురామకృష్ణరాజు రాజీనామా నిర్ణయంతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్షంలోని టీడీపీకి కూడా బెన్‌ఫిట్స్ ఉండే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార వైసీపీకి, పార్లమెంటు స్థానానికి రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Also Read: CM KCR: టార్గెట్ బీజేపీ: థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ స్కెచ్